పాకిస్తాన్ మాజీ కెప్టెన్ లెజెండరీ ప్లేయర్ అసీమ్ వక్రమ్ క్రికెట్ ఆటగాళ్లపై చేసిన కామెంట్స్ ఇవి… ఒక్క ప్లేయర్ ఎనిమిదేసి కిలోల మటన్ తింటారని, ఒక్కడికి ఫిట్నెస్ లేదంటూ మండిపడ్డాడు…. ఆఫ్ఘనిస్తాన్ మీద ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోవడానికి సిగ్గుండాలి అంటూ వసీమ అక్రమ్ కామెంట్స్ చేశారు. ఆఫ్ఘనిస్తాన్ పై వరల్డ్ కప్ లో ఓడిపోవడాన్ని పాకిస్తాన్ జీర్ణించుకోలేకపోతోంది.
Advertisement
వరల్డ్ కప్ లో పాకిస్తాన్ ఆటగాళ్ల తీరు, ప్రదర్శనపై ఆ దేశ ఆటగాళ్లు మండిపడుతున్నారు. ఓ టీవీ ఛానల్ తో మాట్లాడిన వసీమ్ అక్రమ్ రెండేళ్లుగా కనీసం పాకిస్తాన్ ఆటగాళ్లు ఫిట్నెస్ పరీక్షలు కూడా చేయించుకోవడం లేదన్నారు.
Advertisement
గతంలో మిస్ బౌల్హర్ పాకిస్తాన్ కోచ్ గా ఉన్నప్పుడు ఆటగాళ్లకు తప్పనిసరి ఫిట్నెస్ పరీక్షలు చేశాడు అన్న వసీమ్ అక్రమ్ అప్పుడు ఆటగాళ్లంతా ఆ నిర్ణయంపై వ్యతిరేకత చూపించారని… ఇప్పుడు పాకిస్తాన్ ఫీల్డింగ్ ప్రమాణాలు ఈ స్థాయిలో దారుణంగా పడిపోవడానికి ఆ తప్పుడు నిర్ణయాలే కారణం అంటూ మండిపడ్డారు. చెన్నైలో జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ విసిరిన 282 పరుగుల లక్ష్యాన్ని కేవలం రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆఫ్గనిస్తాన్ సంచలన విజయం సాధించింది.