బాలకృష్ణ హీరోగా వచ్చిన భగవంత్ కేసరి సినిమా రిలీజ్ అయి మంచి టాక్ ని సొంతం చేసుకుంది. ఈ దసరాకి విడుదలైన భగవంత్ కేసరి సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. లియో సినిమాకి మంచి రెస్పాన్స్ మొదట్లో వచ్చింది. యూత్ ఆడియన్స్ సినిమాని చూడడానికి ఆసక్తి చూపించారు. కానీ నిన్న, ఈరోజు మాత్రం లియో సినిమా మీద తెలుగులో మిగిలిన రెండు సినిమాలు ఆదిపత్యం చూపించడం జరిగింది.. ముఖ్యంగా భగవంత్ కేసరి సినిమా గురించి ప్రత్యేకించి చెప్పుకోవాలి. భగవంత్ కేసరి భారీ బడ్జెట్ తో వచ్చింది. భారీ వసూళ్లతో ఏకంగా 40 కోట్ల రూపాయల షేర్ మార్కుని దాటేసింది.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్కు 65 కోట్ల రూపాయల వరకు ఉంది మొదటి వీకెండ్ లో వసూళ్లను చూసి 15 కోట్ల నష్టం వస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు వసూళ్లని చూస్తే మైండ్ బ్లాక్ అయిపోతుంది. చాలా చోట్ల మొదటి రోజు కంటే ఎక్కువ వసూళ్లను నమోదు చేసుకుంది ముఖ్యంగా ఉత్తరాంధ్రలో సెన్సేషన్ కలెక్షన్స్ వచ్చాయి. ఈ చిత్రానికి 8 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవర్ఆల్ గా ఈ సినిమా నేటితో 50 కోట్ల రూపాయల వసూల్ షేర్ మార్క్ ని అధికమించబోతోంది అని తెలుస్తోంది. బ్రేక్ ఈవెన్ 15 కోట్లు మాత్రమే ఉంది మిగిలిన 13 కోట్ల రూపాయలలో ఐదు కోట్లు ఈ వీకెండ్ లో వస్తుందని ఫుల్ రన్ లో ఇంకో రెండు నుండి మూడు కోట్ల షేర్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇక్కడ చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!