చిరంజీవి సరైన హిట్టు కోసం చూస్తున్నారు. చిరంజీవి వశిష్ట కాంబో మూవీ యు వి క్రియేషన్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కబోతోంది. ఈ సినిమా బడ్జెట్ ఎంతో తెలిసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఈ సినిమా బడ్జెట్ 200 నుండి 250 కోట్ల రూపాయలని తెలుస్తోంది యువి నిర్మాతలు సాహో, రాధే శ్యామ్ తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా ఇది. అయితే బడ్జెట్ మాత్రం భారీగా ఉండడంతో కచ్చితంగా రిస్కు చేస్తున్నారని తెలుస్తోంది.
చిరంజీవి రీఎంట్రీ తరవాత నటించిన సినిమాల్లో మెజారిటీ సినిమాలు నష్టాలను తీసుకువచ్చాయి. మరి ఇలాంటి టైం లో ఇంత భారీ బడ్జెట్ సినిమాని తీసుకురావడం కచ్చితంగా రిస్క్ అని చెప్పొచ్చు. నిర్మాతలు వశిష్ట పై ఉన్న నమ్మకం వలన ఇంత భారీ బడ్జెట్లో సినిమా చేయడానికి ఒప్పుకున్నారని అర్ధం అవుతోంది. పైగా చిరంజీవి కూడా ఇప్పుడు కథల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిరంజీవి రెమ్యూనరేషన్ 50 కోట్ల రూపాయలని తెలుస్తోంది.
మరిన్ని తెలుగు సినిమా వార్తలు కోసం ఇక్కడ చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!