నటుడు పృథ్విరాజ్ గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ అంటూ పృథ్విరాజ్ బాగా పాపులర్ అయిపోయారు. సినిమాల్లో నటించడమే కాకుండా, రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. పృథ్వి 2019 ఎన్నికల్లో వైసిపి పార్టీ తరఫున ప్రచారం చేసి ప్రాచుర్యం పొందారు. వైసిపి అధికారంలోకి వచ్చాక ఈయన టిటిడి చైర్మన్ బాధ్యతల్ని తీసుకున్నారు. ఈ పదవిని కాస్త పక్కదారి పట్టించడంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది తర్వాత ఆయన ఈ పదవికి రాజీనామా చేశారు ఆ తర్వాత నుండి కూడా జనసేన పార్టీకి సపోర్ట్ చేస్తూ ఉంటున్నారు సినిమాల్లో కూడా బిజీగా ఉంటారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. చాలా సినిమాల్లో నటించి అందర్నీ బాగా నవ్వించారు.
Advertisement
Advertisement
ఎప్పుడు కూడా ప్రేక్షకుల్ని బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటారు పృథ్వి. ఇదిలా ఉంటే పృధ్విరాజ్ తన భార్య కవితకు విడాకులు ఇస్తున్నట్లు కోర్టులో పిటీషన్ పెట్టి చాలా కాలం అయిపోయింది. అందుకు ఆయన సతీమణి కవిత ఒప్పుకుంది. అలీమోనీ కింద తన భార్యకి నెలకి 8 లక్షల రూపాయలు ఇవ్వాలని కోర్టు తీర్పునివ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రతి ఒక్కరు దీని గురించి చర్చించుకుంటున్నారు.
ఇదెక్కడి అన్యాయం నెలకు ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం ఏంటి ఇదెక్కడ తీర్పు అంటూ పృథ్వి నేరుగా మీడియా ముందుకి వచ్చి మాట్లాడడం జరిగింది. ఇప్పుడు తనకి అవకాశాలు కూడా రావట్లేదని తన నెల సంపాదనని దృష్టిలో పెట్టుకుని తీర్పు కోటి ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు. దీన్ని ఒకసారి జడ్జి పరిశీలించి ఆయనకి ఒక అవగాహన వచ్చాక తీర్పుని ఇవ్వాలని ఆయన అన్నారు మరి కోర్టు మార్పు చేస్తుందో లేదో చూడాలి.
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం వీటిని చూడండి! తెలుగు న్యూస్ కోసం ఇవి చూడండి!