Home » 8th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

8th march 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

నేడు ఉభయ సభల్లో దివంగత మంత్రి మేకపాటి గొతమ్ రెడ్డి సంతాప తీర్మానం చేయ‌నున్నారు. గౌతమ్ రెడ్డి మృతికి ఉభయ సభలు సంతాపం తెల‌ప‌నున్నాయి. సంతాప తీర్మానం అనంతరం ఉభయ సభలను వాయిదా వేస్తారు. ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రారంభం కానుండ‌గా ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభం కానుంది.

Advertisement

Ap cm jagan

Ap cm jagan

నేడు అంత‌ర్జాతీయ‌ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా ఏపీ ప్ర‌భుత్వం మ‌హిళ‌ల‌కు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని మ‌హిళ‌ల‌కు క్యాజువ‌ల్ లీవ్ ను ప్ర‌క‌టించింది.

ర‌ష్యా ఉక్రెయిన్ యుద్దంలో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఖార్గివ్ లో జ‌న‌ర‌ల్ విటాలీ గెరసిమోవ్ ను ఉక్రెయిన్ సైన్యం మ‌ట్టుపెట్టింది.

ఉక్రెయిన్ లో ర‌ష్యా మ‌రోసారి యుద్ద విరామం ప్ర‌క‌టించింది. ఉక్రెయిన్ లోని విదేశీయుల త‌ర‌లింపుకు మ‌రోసారి అవ‌కాశం క‌ల్పిస్తూ మ‌ధ్యాహ్నం 12 గంట‌ల నుండి కాల్పుల‌ను విర‌మించుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది.

ర‌ష్యా సైనిక చ‌ర్య‌ల కార‌ణంగా 17 ల‌క్ష‌ల మంది ఉక్రెయిన్ పౌరులు శ‌ర‌ణార్థులుగా మారిన‌ట్టు యూఎన్ ఓ ప్ర‌క‌టించింది.

Advertisement

తిరుమ‌ల తిరుప‌తిలో ఎప్రిల్ 1 నుండి ఆర్జిత సేవ‌ల‌ను పునం ప్రారంభించాల‌ని టీటీడీ నిర్ణ‌యం తీసుకుంది. క‌రోనాకు ముందున్న విధానంలోనే టికెట్ల బుకింగ్ ను తిరిగి ప్రారంభించ‌నుంది.

ఏపీ ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌ల‌ హాల్ టికెట్లు సిద్ద‌మైన‌ట్టు ఇంట‌ర్ బోర్డ్ వెల్ల‌డించింది. విద్యార్థులు హాల్ టికెట్ల‌ను ఇంట‌ర్ బోర్డ్ వెబ్ సైట్ నుండి డౌన్ లోడ్ చేసుకోవాల‌ని సూచించింది.

నేష‌న‌ల్ స్టాక్ ఎక్సేంజ్ కో లొకేష‌న్ కుంభ‌కోణం కేసులో ఎన్ ఎస్ ఈ మాజీ ఎండీ సీఈఓ చిత్రా రామ‌కృష్ణ‌ను 7రోజుల పాటూ సీబీఐ క‌స్ట‌డీక అప్పగిస్తూ ఢిల్లీ కోర్టు ఆదేశాలిచ్చింది.

ఏపీలో సీఎం జ‌గ‌న్ విద్యార్థుల ఫీజు రియంబ‌ర్స్మెంట్ కోసం తీసుకువ‌చ్చిన ప‌థ‌కం జ‌గ‌న‌న్న విద్యాదీవెన‌. ఈ ప‌థ‌కం కింద‌ నేడు విద్యార్థుల త‌ల్లుల ఖాతాల్లో డ‌బ్బు జ‌మ కావాల్సిం ఉంది. కానీ మ‌హిళా దినోత్స‌వం సంధ‌ర్బంగా ఈ రోజు సీఎం ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉండ‌టంతో ప్ర‌భుత్వం ఈ కార్య‌క్ర‌మాన్ని వాయిదా వేసింది.

నేడు మ‌హిళా దినోత్స‌వం సంధ‌ర్భంగా టీఎస్ ఆర్టీసీ మ‌హిళ‌ల కోసం బంపరాఫ‌ర్ లు ప్ర‌క‌టించింది. రాష్ట్రంలో 60 ఏళ్లు దాటిన మ‌హిళ‌ల‌ల‌కు ఉచిత ప్ర‌యాణంతో పాటూ మ‌రిన్ని ఆఫ‌ర్ ల‌ను ప్ర‌క‌టించింది.

Visitors Are Also Reading