Home » 5th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

5th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

దేశంలో క‌రోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. నిన్న ల‌క్షా డెబ్బై వేల‌కు పైగా కేసులు న‌మోదు కాగా గడిచిన 24 గంట‌ల్లో భార‌త్ లో క‌రోనా కేసుల భారీగా త‌గ్గాయి. మొత్తం కొత్త‌గా 1,27,952 కేసులు నమోదయ్యాయి.

modi
ప్రధాని నరేంద్రమోడీ నేడు తెలంగాణ పర్యటనకు వ‌స్తున్నారు. శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం, ఇక్రిశాట్ ఉత్సవాల్లో ప్రధాని పాల్గొన‌నున్నారు. దాంతో సీఎం కేసీఆర్ ప్ర‌ధానికి స్వాగ‌తం ప‌ల‌క‌నున్నారు.

Advertisement

విశాక‌ ఏజెన్సీలో దట్టంగా పొగ మంచు కురుస్తోంది. ద‌ట్టంగా కురుస్తున్న పొగ‌మంచు కార‌ణంగా స్థానికులు ఇబ్బంది ప‌డుతున్నారు. పాడేరులో 10 డిగ్రీలు, మినుములూరులో 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

బీజేపీలో విషాదం చోటు చేసుకుంది. బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జంగా రెడ్డి నేడు మృతి చెందారు. దాంతో బీజేపీ కార్య‌క‌ర్త‌లు నాయుకులు ఆయ‌న మృతికి సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు.

ఏపీలో బీజేపీ ఏపీ కోర్ కమిటీ వ‌ర్చువ‌ల్ స‌మావేశం ఏర్పాటు చేసింది. భవిష్యత్తు కార్యాచరణఫై, కొత్త జిల్లాల ఏర్పాటుపై కోర్ కమిటీలో సుదీర్ఘ చర్చ జ‌రిగింది. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో స్థానికంగా ఉన్న పరిస్థితులని అధ్యయనం చేసేందుకు త్రిమెన్ కమిటీ వేయాలని ఈ క‌మిటీ నిర్ణయం తీసుకుంది.

Advertisement

పీఆర్సీ అంశంపై ఉద్యోగుల అసంతృప్తిని సరిదిద్దేందుకు మంత్రుల కమిటీ ప్రయత్నం చేసింది. అనుమానాల నివృత్తితో పాటు కొన్ని సర్దుబాటు చేశామ‌ని పేర్కొంది. కోవిడ్ కారణంగా ఇబ్బందులు ఉన్నా ఉదారంగానే ఉద్యోగుల కు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామ‌ని స‌జ్జ‌ల పేర్కొన్నారు.


నేడు కలెక్టరేట్ కు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రానున్నారు. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్ర‌క‌టించాల‌ని బాలకృష్ణ డిమాండ్ చేస్తున్న‌సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే కలెక్టర్ నాగలక్ష్మికి బాల‌య్య వినతి పత్రం అంద‌జేయ‌నున్నారు.

ఆఫ్గ‌నిస్థాన్ త‌జికిస్థాన్ ప్రాంతాల్లో భూకంపం న‌మోద‌య్యింది. 5.7 మ్యాగ్నిట్యూడ్ తీవ్ర‌త‌తో భూప్ర‌కంప‌న‌లు న‌మోద‌య్యాయి.

అమెరికాలో క‌రోనా మ‌ర‌ణాలు 9ల‌క్ష‌లు దాటాయి. భ‌విష్య‌త్ లో మరిన్ని పెద్ద వేవ్ లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని యూకే నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.

విప‌క్షాలు కలిసివ‌స్తే సోష‌ల్ మీడియాపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి అశ్వ‌ని వైష్ణ‌వ్ రాజ్య‌స‌భ‌లో ప్ర‌క‌టించారు. మ‌హిళ‌ల గౌర‌వాన్ని కాపాడ‌టంలో రాజీప‌డే అవ‌కాశమే లేద‌ని చెప్పారు.

Visitors Are Also Reading