పెళ్లి అనగా సమాజంలో ఇద్దరు భాగస్వామ్యుల మధ్య హక్కులు, బాధ్యతలను స్థాపించే చట్టబద్ధమైన ఒప్పందం. వివాహం నిర్వచనం వివిధ సాంస్కృతుల ప్రకారం మారుతుంది. వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టం. ముఖ్యంగా ఆడపిల్లకి. ఎందుకంటే పెళ్లి తర్వాత తన పుట్టింటిని వదిలేసి అత్తవారింట్లో కొత్త ప్రదేశంలో కొత్త మనుషుల మధ్యకి వెళ్లాల్సి వస్తుంది.
Advertisement
READ ALSO : RRR నుంచి HIT 2 : ఈ ఏడాది బయ్యర్స్ కు లాభాలను అందించిన తెలుగు సినిమాల లిస్ట్..!
అలాంటప్పుడు మనసులో ఎన్నో సందేహాలు, ఆలోచనలు సహజం. అలాంటప్పుడు మనం పెళ్లికూతురుతో మరికొన్ని విషయాలు మాట్లాడి తనని మరింత కృంగదీయకూడదు. మరి పెళ్లి రోజు పెళ్లి కూతురుతో అసలు చెప్పకూడని, అనకూడని విషయాలు తెలుసుకుందాం.
వ. # ఆడపిల్ల వారికి మరీ ఖర్చులు కట్నం, పెళ్లి పనులు వగైరా బరువంతా ఆడపిల్ల వారిపైనే ఉంటుంది. కాబట్టి మనం పెళ్లికూతురుతో కట్నం ఎంత? పెళ్లికి ఎంత ఖర్చు పెడుతున్నారు? అలాంటి క్వశ్చన్స్ అడగకూడదు.
Advertisement
# పెళ్లికి ముందే ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతుంది పెళ్లికూతురు. దానివల్ల కొంచెం లావైంది అనుకోండి. అంతే మనవాళ్ళు ఒళ్ళు చేసినట్టున్నావ్ అని కామెంట్స్ చేస్తారు. ఆ కామెంట్స్ చేయకూడదు.
# ఆంటీ అనే పిలుపు, కేవలం పెళ్లయినంత మాత్రాన ఆంటీ అయిపోతారా? ఆంటీ ఆంటీ అంటూ స్నేహితులు, చుట్టాలు ఆటపట్టించడం కామన్. కానీ ఆ మాటలు మెంటల్ గా బాగా డిస్టర్బ్ చేస్తాయి.
# పెళ్లి అన్నాక వరుడి తరపు వారు మర్యాదల్లో లోటు జరిగిందని, కోపతాపాలు సహజం. కానీ వీలైనంత వరకు ఈ గొడవల్ని పెళ్లికూతురు దృష్టికి తీసుకురాకపోవడం మంచిది.
# పెళ్లి చేసుకునేది సంతోషంగా బతకడానికి, అలాంటి పెళ్లిలో భర్తతో గొడవపడకు, దేనికైనా సర్దుకు పోవాలి అని చెప్తుంటారు. పిల్లకి మంచి చెప్తున్నాం అనుకుంటారు చాలామంది. కాబట్టి పెళ్లయ్యాక గొడవలు ఉంటాయి అని లేని భయాలను క్రియేట్ చేయకుండా సంతోషంగా ఉండాలని ఆశీర్వదించండి.
read also : మీ వాహనానికి ఈ సిరీస్ నంబర్ ప్లేట్ ఉంటే దేశంలో ఎక్కడికెళ్లినా పోలీసులు టచ్ చేయరు?