గడిచిన 24 గంటల్లో భారత్ లో 1.49 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయి. దేశంలో ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య ఐదు లక్షలు దాటింది.
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు పై ఆందోళనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. కొత్త జిల్లాల డిమాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హీరో ఎమ్మెల్యే బాలకృష్ణ హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని నేడు మౌనదీక్షకు పూనుకున్నారు
Advertisement
కొత్త రాజ్యాంగాన్ని తీసుకురావాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజ్యాంగాన్ని మార్చడం అంటే అంబేద్కర్ ను అవమానించడమే అంటూ విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో నేడు బిజెపి భీమ్ పేరుతో ఢిల్లీలో పాదయాత్ర చేయనున్నారు. బండి సంజయ్ అధ్యక్షతన ఈ పాదయాత్ర జరగనుంది.
ఏపీలో భూముల ధరలు పెరగనున్నాయి. వారం రోజుల కిందట ఏపీ సర్కార్ జిల్లాల పునర్విభజన పై ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కొత్త జిల్లాలు ఏర్పడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో భూముల ధరలకు రెక్కలు రానున్నాయి. కొత్త ఆస్తుల విలువను మార్కెట్లోకి తీసుకు వచ్చేందుకు జగన్ సర్కారు ఇప్పటికే రంగం సిద్ధం చేస్తోంది.
Advertisement
చైనా రాజధాని బీజింగ్ వేదికగా ఈరోజునుండి వింటర్ ఒలంపిక్స్ ప్రారంభంకానున్నాయి. వారం రోజులపాటు ఈ క్రీడలు జరగనున్నాయి. 90 దేశాల ఆటగాళ్ళు క్రీడల్లో పాల్గొనబోతున్నారు.
ఏపీలో 2 థర్మల్ పవర్ ప్లాంట్ లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో కరెంట్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. దాంతో గ్రామీణ ప్రాంతాల్లో రొటేషన్ పద్ధతిలో ప్రతిరోజు రెండు గంటలపాటు కరెంటు కోత విధించనున్నారు.
తెలంగాణ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ముచ్చింతల్ లో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది సమారోహం వేడుకలకు హైదరాబాద్ నుండి నడిపే బస్సుల్లో 50శాతం అదనపు చార్జీలు వసూలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ పై కాల్పులు జరిపిన సంగతి తెలిసిందే. అసద్ కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కాగా హిందూ వ్యతిరేక నినాదాలు చేసినందుకు కాల్పులు జరిపినట్టు నిందితులు పోలీసుల విచారణలో వెల్లడించారు.
ఇసుక అక్రమ రవాణా కేసులో పంజాబ్ సీఎం చన్నీ మేనల్లుడు భూపిందర్ సింగ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
తనపై కాల్పులు జరిపిన అంశాన్ని లోక్ సభలో లేవనెత్తుతానని ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. ఎంఐఎం పార్టీ తరపున దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రామాలు చేపడతామని అన్నారు.