పెళ్లికి ముందు జీవితం చాలా చిన్నది. కేవలం ఇరవై ఏళ్ల వరకూ మాత్రమే ఆ జీవితం ఉంటుంది. కానీ పెళ్లి తరవాత ఇంకా 80 ఏళ్ల జీవితం మిగిలి ఉంటుంది. కాబట్టి పెళ్లికి ముందు జీవితంలో ఎలా స్థిరపడాలో ఆలోచించాలి. పెళ్లి తరవాత జీవితంలో ఎలా ఎదగాలి కుటుంబ జీవితాన్ని ఎలా గడపాలి. ఆర్థికంగా ఎలా బలపడాలి లాంటివి ఆలోచించాలి. అయితే ఇవన్నీ జరగాలంటే ముందు భార్య భర్తల మధ్య మంచి సంబంధాలు ఉండాలి. ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి.
ఇవి కూడా చదవండి: ఈ ఒక్క విషయం తెలిస్తే భార్యా భర్తల మధ్య అసలు గొడవలే ఉండవట..అదేంటంటే..?
Advertisement
కానీ ప్రస్తుతం బిజీ జీవితంలో చాలా మంది భార్యా భర్తలు చిన్న చిన్న కారణాల తో గొడవలు పడుతున్నారు. అంతే కాకుండా చిన్న చిన్న గొడవలే పెద్ద గొడవలకు దారి తీస్తున్నాయి. ఆ కారణాలతో విడాకులు తీసుకుంటున్నవాళ్లు కూడా ఉన్నారు. ఇక కొంత మంది ఎన్ని గొడవలు జరిగినా జీవితాంతం విడిపోకుండా కలిసి ఉంటున్నారు. అయితే వారి వైవాహిక జీవితంలో మాత్రం సంతోషం ఉండటం లేదు. పిల్లల కోసమో సమాజం కోసమో కాంప్రమైజ్ అయ్యి మాత్రమే వాళ్లు కలిసి ఉంటున్నారు.
Advertisement
అయితే భార్య భర్తలు బంధం కలిసి ఉండాలంటే వారి మధ్య ఒక నాలుగు పదాలు ఖచ్చితంగా ఉండాలని అప్పుడే వారి బంధం బలపడుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఆ పదాలు కూడా మనకు తెలిసినవే. భార్య భర్తల మధ్య గొడవలు జరిగినప్పుడు ఎవరో ఒకరు సారీ చెప్పాలట.
ఈ పదంతో వారి మధ్య ఉండే మనస్పర్దలు తొలగిపోతాయట. తప్పు చేసినవారు ఖచ్చితంగా నన్ను క్షమించాలని అడగాలట. అలా చేయడం వల్ల అసలు గొడవ మొదలవకుండా ఉంటుంది. అంతే కాకుండా వీలైతే భార్యభర్తలు ఖచ్చితంగా ప్రతిరోజు ఐలవ్యూ చెప్పుకోవాలి. అలా చెప్పుకోవడం వల్ల ఇద్దరి మధ్య ప్రేమ బలపడుతుంది.