Home » 3rd feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

3rd feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

దేశంలో క‌రోనా కేసుల సంఖ్య కాస్త త‌గ్గుముఖం ప‌ట్టింది. గ‌డిచిన 24 గంట‌ల్లో దేశంలో మొత్తం 1,72,433 కేసులు న‌మోద‌య్యాయి.

 

టీం ఇండియాలో కరోనా క‌ల‌క‌లం రేగింది. శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్, రుతురాజ్ గైక్వాడ్, నవదీప్ సైనీ లకు కరోనా పాజిటివ్ వ‌చ్చింది. వీరితోపాటు… ఫీల్డింగ్ కోచ్ దిలీప్, సెక్యూరిటీ ఆఫీసర్ లోకేష్, మసాజ్ థెరపిస్ట్ రాజీవ్ కుమార్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధార‌ణ అయ్యింది.

Advertisement

సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేరుతో కొత్త ఫేస్ బుక్ ఐడీ క్రియేట్ చేశారు. అంతే కాకుండా ఐడీకి డీపీగా అమ్మాయి ఫోటోను ఏర్పాటు చేశారు. దాంతో తప్పుడు ఫోటోలతో త‌న‌ పేరు డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారని సైబర్ క్రైం లో జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు.

టీటీడీ స్నేక్ క్యాచ‌ర్ భాస్క‌ర్ నాయుడు ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఆరు రోజుల ముందు భాస్క‌ర్ నాయుడు పాముకాటుకు గురయ్యారు. తిరుప‌తిలోని ప్రైవేట్ ఆసుప‌త్రిలో ఆయ‌న చికిత్స పొందుతున్నారు.

అండర్-19 ప్రపంచకప్ మ్యాచ్ లో భార‌త జ‌ట్టు ఆసీస్‌ను చిత్తు చేసి ఫైన‌ల్ కు దూసుకెళ్లింది. 96 పరుగుల తేడాతో ఘన విజయం ఆసిస్ పై ఘ‌నవిజ‌యం సాధించింది. ఎల్లుండి ఇంగ్లండ్‌తో మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

Mk Stalin

Advertisement

మ‌తోన్మాద శ‌క్తుల‌పై పోరాటానికి రావాలంటూ త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి స్టాలిన్ 37 పార్టీల‌కు లేఖ‌ను రాశారు. అఖిల భార‌త సామాజిక‌న్యాయ స‌మాఖ్య‌లో చేరాల‌ని పిలుపునిచ్చారు. బీజేపీని మాత్రం స్టాలిన్ ప‌క్క‌కు పెట్టారు.

పీఆర్సీకి వ్య‌తిరేకంగా ఏపీలో నేడు ప్ర‌భుత్వ ఉద్యోగులు ఛ‌లో విజ‌యవాడ‌కు పిలుపునిచ్చారు. కాగా పోలీసులు ఈ నిర‌స‌న పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ ఉద్యోగుల‌ను అరెస్ట్ చేస్తున్నారు.

cm kcr

cm kcr

దళితులకు కేసీఆర్‌ శుభవార్త చెప్పారు. త్వ‌ర‌లో ప్ర‌వేశ‌పెట్ట‌బోయే బ‌డ్జెట్ లో దళితబంధు కోసం రూ. 20 వేల కోట్లు ఖ‌ర్చుచేయాల‌నే ఆలోచ‌న‌లో సీఎం కేసీఆర్ ఉన్నారు.

చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో విషాదం చోటు చేసుకుంది. ప్ర‌ముఖ న‌టుడు ర‌మేష్ డియో 93ఏళ్లు గుండె పోటుతో మ‌ర‌ణించారు. ర‌మేష్ డియో బాలీవుడ్ లో ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల్లో న‌టించారు.

modi

ఈనెల 5న ప్రధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ హైద‌రాబాద్ కు రానున్నారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా హైద‌రాబాద్ లో ఏర్పాటు చేస్తున్న స‌మ‌తామూర్తి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తారు.

also read : వ‌ధువు న‌గ‌లు వ‌ద్ద‌న‌డంతో ఏడు కుటుంబాల‌కు వెలుగు

Visitors Are Also Reading