ఇండియాలో కొత్తగా 2,35,532 కరోనా కేసులు నమోదయ్యాయి. 871 మరణాలు నమోదయ్యాయి.
ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా బంగారంతో పాటు విదేశీ కరెన్సీని అధికారులు పట్టుకున్నారు. షార్జా ప్రయాణికుడి దగ్గర రూ. కోటి విలువైన 2 కిలోల బంగారం సీజ్ చేశారు. రూ. 75 లక్షల విలువైన విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు.
Advertisement
నేడు అండర్ 19 ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్ జరగనుంది. క్వార్టర్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో భారత్ తలపడనుంది. నేడు సాయంత్రం 6:30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.
నేడు కలెక్టరేట్ల ముట్టడికి ఉపాధ్యాయ సంఘాలు పిలుపునిచ్చాయి. 317 జీవోకు వ్యతిరేకంగా ఉపాధ్యాయ సంఘాల నిరసన కొనసాగనుంది.
పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్‌లో నివాస యోగ్యమైన ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం ఖర్చు ఇతరత్రా అవసరాల కోసం రూ.1 కోటిని ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
Advertisement
ప్రముఖ రచయిత, కవి ఎండ్లూరి సుధాకర్ కన్నుమూశారు. అనారోగ్యం తో నిన్న సుధాకర్ కన్నుమూశారు. ఎన్నో ప్రముఖ రచనల తో ఆయన గుర్తింపు తెచ్చుకున్నారు.
తెలంగాణలో సెలవులను పొడిగిస్తున్నారా లేదా అన్నదానిపై ఈరోజు క్లారిటీ రానుంది. కరోనా ప్రభావం పెద్దగా లేని కారణంగా సెలవులను పొడిగించే అవకాశం లేనట్టు తెలుస్తోంది.
టీం ఇండియా ఆల్ రౌండర్ నిషాంత్ సిందు కరోనా బారిన పడ్డారు. అండర్ 19 క్వార్టర్ ఫైనల్ కు వెళ్ళేముందు సింధు కరోనా బారిన పడటం టీంను ఆందోళనకు గురి చేస్తోంది.
శ్రీవారి భక్తులకు టిటిడి శుభవార్త చెప్పింది. ఆన్ లైన్ లో దర్శన టికెట్లు అందుబాటులో ఉంచినట్లు ప్రకటించింది.
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలానికి చెందిన యువరైతు పన్నాల శ్రీనివాస్ రెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ కు 10వేలు ఇచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం వల్ల తన భూమిలో పంట భాగా పండిందని చెబుతూ కేసీఆర్ కు విరాళాన్ని అందజేశారు.