తిరుమలలో 31వ తేదీన కరెంట్ బుకింగ్ విధానంలో ఆర్జిత సేవా టిక్కెట్లను టీటీడీ జారీ చెయ్యనుంది. 31వ తేదీ నుండి అంగప్రదక్షణం టోకెన్లు కూడా జారీ చెయ్యనుంది. తిరుపతిలో రేపటికి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్నారు.
వరంగల్ లో సార్వత్రిక సమ్మెలో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆటోలు, పలు కార్మిక సంఘాలు, సింగరేణి కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నాయి.
Advertisement
నెల్లూరులో సీఎం వైఎస్ జగన్ పర్యటిస్తున్నారు. గొలగమూడి వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో సీఎం పాల్గొననున్నారు. ఉదయం 10.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి 11.30 గంటలకు నెల్లూరు చేరుకుంటారు.
యాదాద్రి దివ్యక్షేత్ర మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నేడు జరనుంది. పునఃప్రారంభ ప్రతిష్ట మహా కార్యం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు హైదరబాద్ నుండి యాదాద్రికి వెళుతున్నారు.
హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి సిద్దార్థ్ రెడ్డి అనే యువకుడు కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదు మేరకు నింధితుడిపై కేసు నమోదు చేసి పోలీసులు గాలిస్తున్నారు.
Advertisement
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నేడు దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే బ్యాకింగ్ మరియు ఇతర రంగాలు కూడా సమ్మెలో పాల్గొంటున్నాయి.
పెట్రోల్ ధరలు తగ్గేదే లే అంటున్నాయి. తాజాగా లీటర్ పెట్రోల్ ధర మరో 35 పైసలు పెరిగింది. దాంతో హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ.112.35 గా ఉంది.
కరోనా సమయంలో మొదలైన కాలర్ ట్యూన్ కు ఇక పులిస్టాప్ పడనుంది. కరోనా సమయంలో అమితాబ్ బచ్చన్ వాయిస్ తో కాలర్ ట్యూన్ వచ్చిన సంగతి తెలిసిందే.
నేడు పాకిస్థాన్ లో పాక్ ప్రభుత్వం అవిశ్వాస తీర్మాణాన్ని ఎదురుకోబోతుంది.ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ కు సొంత పార్టీ ఎంపీలు, మిత్రపక్షాలు హ్యాండ్ ఇచ్చాయి. దాంతో ఇమ్రాన్ ఖాన్ పరిస్థితి ఏంటన్నది ఆసక్తికరంగా మారింది.
కాంగ్రెస్ వ్యూహకర్తగా ప్రశాంత్ కిషోర్ ను తీసుకునే ఆలోచనలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ శ్రేణులు మాత్రం ప్రశాంత్ కిషోర్ ను వ్యతిరేఖిస్తున్నారు.