Home » 28th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

28th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

దేశంలో కొత్తగా 8,013 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 119 మంది క‌రోనా బాధితులు మృతి చెందారు. ఇక‌ ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,02,601 యాక్టివ్‌ కేసులు న‌మోద‌య్యాయి.

ఉక్రెయిన్‌ సంక్షోభంపై ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. భారతీయుల భద్రత, తరలింపునకు అధిక ప్రాధాన్యం ఇవ్వాల‌ని…. విద్యార్థుల తరలింపు ప్రక్రియ వేగవంతం చేయాలని ప్ర‌ధాని స‌మాశంలో నిర్ణ‌యించ‌నున్నారు.

Advertisement

బుకారెస్ట్‌ నుంచి ఢిల్లీకి ఐదో విమానం చేరుకుంది. విమానంలో స్వదేశానికి 249 మంది భారతీయులు చేరుకున్నారు. ఢిల్లీ నుంచి స్వస్థలాలకు తరలించేందుకు ఏర్పాట్లు పూర్త‌య్యాయి.

వైఎస్ వివాకానంద రెడ్డి హ‌త్య‌పై ఆయ‌న కూతురు డాక్ట‌ర్ సునిత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌న తండ్రి హ‌త్య‌ను వాడుకుని జ‌గ‌న్ రాజ‌కీయంగా ల‌బ్ది పొందార‌ని కామెంట్ చేశారు. హ‌త్య గురించి చెబితే జ‌గ‌న్ భార‌తి తేలిగ్గా తీసుకున్నారని….త‌న భ‌ర్త‌పైనే నిందలు మోపార‌ని అన్నారు.

modi

Advertisement

వార‌ణాసిలో మోడికి బిస్ షాక్ త‌గిలింది. మోడీ నిన్న వార‌ణాల‌సిలో బూత్ స్థాయి కార్య‌కర్త‌ల‌తో స‌మావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి 20 వేల మంది హాజ‌రుకావాల్సి ఉంది. కానీ స‌మావేశం ఆల‌స్యం అవ్వ‌డంతో అంద‌రూ ఒక్క‌క్క‌రూ జారుకున్నారు. దాంతో స‌మావేశం నుండి అంద‌రూ జారుకున్నారు. కాళీ కుర్చీలు ద‌ర్శ‌న‌మిచ్చాయి.

టీడీపీ సీనియ‌ర్ నేత య‌డ్ల‌పాటి వెంక‌ట్రావు క‌న్నుమూశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా మంత్రిగా ఆయ‌న సేవ‌లు అందించారు. 102 ఏళ్ల యడ్ల‌పాటి అనారోగ్యంతో క‌న్నుమూశారు.

బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు జేపీ న‌డ్డా ట్విట్ట‌ర్ అకౌంట్ హ్యాక్ అయ్యింది. యుద్దం జరుగుతున్న స‌మ‌యంలో ఉక్రెయిన్ కు స‌పోర్ట్ గా పోస్టులు క‌నిపించాయి. దాంతో ఆయ‌న త‌న అకౌంట్ హ్యాక్ అయింద‌ని ప్ర‌క‌టించారు.

స్టార్ హీరోయిన్ శృతిహాస‌న్ క‌రోనా బారినప‌డ్డారు. ఈ విష‌యాన్ని శృతిహాస‌న్ సోష‌ల్ మీడియాలో వెల్ల‌డించారు. క‌రోనా రావ‌డంతో తాను ఐసోలేష‌న్ లో ఉన్నట్టు తెలిపింది.

ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడికి అమెరికానే కార‌ణం అంటూ నార్త్ కొరియా ఆరోప‌ణలు చేసింది. ఉత్త‌ర‌కొరియో వెబ్ సైట్ లో విదేశాంగ‌శాక ఈ విష‌యాన్ని పేర్కొంది.

ఉక్రెయిన్ లో మిలిట‌రీ చ‌ర్య‌లు ఐదోరోజు కూడా కొన‌సాగుతున్నాయి. దాంతో ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ పై తాజాగా ఆస్ట్రేలియా ప్ర‌భుత్వం ట్రావెన్ బ్యాన్ ప్ర‌క‌టించింది.

Visitors Are Also Reading