ఇండియాలో కొత్తగా 2,86,384 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా కరోనాతో 573 మంది మృతి చెందారు.
ఈరోజు నుండి కార్వీ ఎండీ పార్థసారథిని ఈడీ ప్రశ్నించనుంది. మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కుంటున్న పార్థసారథి ని 4 రోజులపాటు ఈడీ ప్రత్యేక కోర్టు కస్టడీ కి అనుమతి ఇచ్చింది. ఈనెల 30 వరకు పార్థసారథిని కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.
Advertisement
ఏపీలో నేడు స్కూళ్ల నిర్వహాణపై కీలక భేటీ జరగనుంది. పాఠశాలలపై, మ్యాపింగ్‌పై ఎమ్మెల్యేలకు మూడు రోజులపాటు అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బడుల నిర్వహణ, టీచర్ల సర్దుబాటుపై ఈ కార్యక్రమం లో నిర్ణయం తీసుకుంటారు.
ఏపీలో నేటి నుంచి జిల్లా కేంద్రాల్లో ఉద్యోగ సంఘాల రిలే నిరాహార దీక్షలు జరగనున్నాయి. ఈనెల 30 వరకు ఉద్యోగ సంఘాల రిలే నిరాహార దీక్షలు జరగనున్నాయి. పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా ఉద్యోగసంఘాల నిరసనలకు పిలుపునిచ్చాయి.
రేపు ఉదయం 9 గంటలకు రూ. 300 తిరుమల స్వామి వారి సర్వ దర్శనం టికెట్లు విడుదల చేయనున్నారు. ఎల్లుండి టిటిడి సర్వదర్శనం టోకెన్లను విడుదల చేయనుంది. ఫిబ్రవరి కోటా టికెట్లను టీటీడీ విడుదల చేయనుంది.
Advertisement
కేరళలో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కొత్తగా 49,771 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 63 మంది కోరోనా బాధితులు మృతి చెందారు.
కొత్త పిఆర్సి ప్రకారమే ఉద్యోగులకు పెన్షనర్లకు నెలవారీ జీతాలు చెల్లిస్తామని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఈ మేరకు ఫిబ్రవరి లో జనవరి జీతాలు చెల్లించాలని దానికి అనుగుణంగా బిల్లును రూపొందించాలని ఆర్థిక శాఖను ఆదేశించింది.
కరోనా సోకిన గర్భిణులకు వైద్యం చేసేందుకు నిరాకరించవద్దని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. కరోనా సోకిన గర్భిణులను ఆస్పత్రిలో చేర్చుకోకుండా తిరస్కరించే ప్రభుత్వ వైద్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.
మైనర్ బాలికపై అత్యాచార ఆరోపణలు రావడంతో ఓ వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లాకు చెందిన మత్స్యకార సహకార సంఘం చైర్మన్ కన్నా భూశంకరరావు మైనర్ బాలికపై అత్యాచారం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
కోస్తాంధ్ర జిల్లాలో నేడు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కోస్తాంధ్ర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు…. రాయలసీమ లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.