మళ్లీ పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగిపోయాయి. లీటర్ పెట్రోల్‌పై 89 పైసలు, డీజిల్‌పై 86 పైసలు పెరిగింది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ రూ.111.80 గా ఉండగా డీజిల్ ధర రూ.98.10 గా ఉంది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.113.60 గా ఉండగా డీజిల్ రూ.99.56 లకు చేరింది.
Advertisement
నేడు, రేపు చలాన్లు, స్టాంప్ డ్యూటీల కోసం ఎస్‌బీఐ బ్రాంచీలు తెరుచుకోనున్నాయి.
హైదరాబాద్ బేగంపేటలో వింగ్స్ ఇండియా ఎయిర్ షో కొనసాగుతోంది. నేడు, రేపు సాధారణ ప్రజలకు సైతం షో చూసేందుకు అనుమతిచ్చారు.
అంతర్జాతీయ విమానాల రాకపోకలకు కేంద్రం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. నేటి నుంచి ఇతర దేశాలకు కూడా విమాన సర్వీసులు నడుస్తున్నాయి.
నేడు ఎర్త్ అవర్ పాటించాలని గవర్నర్ బిశ్వభూషణ్ ప్రజలను కోరారు. ఇవాళ రాత్రి 8.30 నుండి 9.30 గంటల వరకు ఎర్త్ అవర్ పాటించాలని కోరారు. అత్యవసరమైతేనే లైట్లు, ఇతర పరికరాలు ఉపయోగించాలని గవర్నర్ అన్నారు.
Advertisement
హైదరాబాద్ టోలిచౌకి వద్ద పోలీసులు డ్ర* సరఫరా చేస్తున్న ముఠాను పట్టుకున్నారు. గోవా నుండి LSD, MDMA, ఎస్టాకి పిల్స్ ను తీసుకొచ్చి వంశీధర్ రెడ్డి హైదరాబాద్ లో విక్రయిస్తున్నాడు. దాంతో పోలీసులు టోలిచౌకి దగ్గర వంశీధర్ రెడ్డి కారును తనిఖీ చేయగా పోలీసులకు దొరికిపోయాడు.
నేడు 10 గంటలకు ఆన్ లైన్ లో వసతి గదుల కోటాను టీటీడీ విడుదల చేసింది. ఏప్రిల్, మే, జూన్ మాసానికి సంబంధించిన వసతి గదుల కోటాను టీటీడీ విడుదల చేసింది.
యూపీ సీఎం యోగి అధిత్యానాథ్ తన కేబినెట్ లో ముస్లీం వ్యక్తికి మంత్రికి అవకాశం ఇచ్చారు. దానిష్ అజాద్ అన్సారీని యోగి తన కేబినెట్ లోకి తీసుకున్నారు.
బస్ పాస్ ధరలను టీఎస్ ఆర్టీసీ భారీగా పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1 నుండి పాస్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే స్టూడెంట్ పాస్ ల పై మాత్రం ధరలను పెంచడం లేదని ప్రకటించింది.