Home » 26th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

26th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

మార్చి 4వ తేదీన పోలవరం ప్రాజెక్టును చూసేందుకు కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ వ‌స్తున్నారు. ఫిష్ ల్యాడర్, గైడ్ బండ్, కాఫర్ డ్యాం, పవర్ హౌస్, రేడియల్ గేట్ల పనులను షెకావ‌త్ ప‌రిశీలించ‌నున్నారు.

Advertisement

ఉక్రెయిన్‌లోని భారతీయులకు భాద‌త విదేశాంగ‌శాఖ కొత్త మార్గదర్శకాలు విడుద‌ల చేసింది. భారతీయులు సరిహద్దు ప్రాంతాలకు వెళ్లొద్దు, ముందస్తు సమన్వయం లేకుండా సరిహద్దు పోస్టులకు వెళ్లొద్దు, పశ్చిమ నగరాల్లోనే ఉండాల‌ని మార్గ‌దర్శ‌కాల్లో పేర్కొంది.

హైద‌రాబాద్ ఓఆర్‌ఆర్‌పై రోడ్డుప్రమాదం జ‌రిగింది. శంషాబాద్ నుంచి తుక్కుగూడ వెళ్తుండగా కారు లారీని ఢీకొట్టింది. దాంతో కారులో ఉన్న సబ్ ఇన్‌స్పెక్టర్ రాఘవేందర్‌గౌడ్ మృతి చెందారు. మృతుడు మహబూబ్‌నగర్ రైల్వే పీఎస్‌లో పనిచేస్తున్నట్లు గుర్తించారు.

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఉక్రెయిన్‌లో రష్యా చర్యలపై భద్రతా మండలిలో ఓటింగ్ నిర్వ‌హించారు. కాగా భారత్‌, చైనా దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి.

నేడు శ్రీశైలంలో 5వ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జ‌రుగుతున్నాయి. ఉదయం దేవ‌స్థానం ఈవో ల‌వ‌న్న పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం తరుపున మంత్రి వెల్లంప‌ల్లి వెల్లంప‌ల్లి శ్రీనివాస్ పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

Advertisement

నేడు భారత్‌-శ్రీలంక మధ్య రెండో టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. ధర్మశాల వేదికగా రాత్రి 7 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

ఈనెల 27 నుంచి కాంగ్రెస్ నేత భ‌ట్టి విక్ర‌మార్క‌ పాద‌యాత్ర చేయ‌నున్నారు. మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ట్టి విక్ర‌మార్క‌ పాద‌యాత్ర నిర్వ‌హించ‌నున్నారు. ముదిగొండ మండ‌లం య‌డ‌వ‌ల్లి గ్రామం నుంచి భ‌ట్టి విక్ర‌మార్క పాద‌యాత్ర ప్రారంభం కానుంది.

ద‌క్షిణ గాలుల ప్ర‌భావంతో ఆదిలాబాద్ లో ఊష్ణోగ్ర‌త‌లు పెరిగే అవ‌కాశ‌ముంద‌ని వాతావ‌ర‌ణశాఖ వెల్ల‌డించింది. నిన్న ఆదిలాబాద్ లోని చాప్రాలో అత్య‌ధికంగా 38.2 డిగ్రీల ఊష్ణోగ్ర‌త‌లు న‌మోద‌య్యాయన‌ని తెలిపింది.

హైద‌రాబాద్ లోని ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జ‌రింగింది. మాదాపూర్ లోని వ్యాపారి ఇంట్లో 50ల‌క్ష‌ల విలువైన సొత్తును దుండ‌గులు దొంగ‌లించారు. కావూరిహిల్స్ లో గంట‌ల వ్య‌వ‌ధిలోనే ఈ ఘ‌ట‌న చోటు చేసుకుంది.


ఉక్రెయిన్ లో చిక్కుకున్న‌ 22 మంది విద్యార్థులు నేడు ఉక్రెయిన్ నుండి ఏపీకి చేరుకోనున్నారు. మూడు ప్ర‌త్య‌క‌విమానాల్లో విద్యార్థులు ఢిల్లీ ముంబై చేరుకోనున్నారు.

Visitors Are Also Reading