ఇండియాలో కరోనా ఉదృతి మరింత తగ్గుముకం పట్టింది. గడిచిన 24 గంటల్లో 13,166 పాజిటివ్ కేసులు నయోదయ్యాయి. 302 మరణాలు నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం 1,34,235 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.
ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ను రష్యా బలగాలు చుట్టుముట్టాయి. 24 గంటలుగా రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్ పై దాడులను కొనసాగిస్తూనే ఉంది. కీవ్‌కు వెళ్లే రోడ్లు అన్నింటినీ రష్యా సేనలు దిగ్బందించాయి, రష్యా దాడుల్లో ఇప్పటి వరకు 137 మంది మృతి చెందారు.
Advertisement
ఉక్రెయిన్‌పై యుద్ధం తర్వాత తొలిసారి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రెస్‌మీట్ నిర్వహించారు. ప్రెస్ మీట్ లో పుతిన్ రష్యాను రక్షించడానికి ఉక్రెయిన్‌పై దాడి తప్పదని వ్యాఖ్యానించాడు.
రష్యా దాడులను అమెరికా తీవ్రంగా తప్పుబడుతోంది. రష్యాపై జోబైడెన్ కఠిన ఆంక్షలను విధించారు. యూఎస్‌లోని 4 రష్యా బ్యాంకుల ఆస్తులు ఫ్రీజ్ చేశారు. దాంతో రష్యాకు చెందిన 250 బిలియన్ డాలర్ల వీటీబీ బ్యాంక్ ఆస్తులు ఫ్రీజ్ అయ్యాయి. అంతే కాకుండా ఉక్రెయిన్ పరిస్థితులపై 30 దేశాలతో అమెరికా చర్చించనున్నట్టు ప్రకటించారు.
Advertisement
వచ్చే నెలలో ఏపీలో శాసన సభ మరియ శాసన మండలి సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాలకు చంద్రబాబు డుమ్మాకొట్టే ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే అంశంపై పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.
రష్యా ఉక్రెయిన్ ల మధ్య యుద్దం బంగారం పై ఎఫెక్ట్ చూపిస్తోంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం ధర ఏకంగా 20 డాలర్లు పెరిగింది. ఇక హైదరాబాద్ మార్కెట్ లోనూ బంగారం 24 క్యారెట్ల ధర రూ.53100 కు చేరుకుంది.
ఝూర్ఖండ్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. బార్బెండియా వంతెన వద్ద పడవ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 14 మంది గల్లంతయ్యారు. కాగా 4గురిని ఎన్డీఆర్ ఎఫ్ సిబ్బంది రక్షించగా మిగిలిన వారికోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
ఐఐటీ ఎంట్రన్స్ కోసం నిర్వహించే జేఈఈ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. షెడ్యూల్ ప్రకారంగా జేఈఈ పరీక్షను జూలై 3న నిర్వహిస్తారు. పరీక్షా ఫలితాలను అదే నెల 18న విడుదల చేస్తారు.
విరాట్ కోహ్లీ బెంగుళూరు జట్టు కెప్టెన్సీ నుండి తప్పుకున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా తాను కెప్టెన్సీ నుండి తప్పుకోవడం పై క్లారిటీ ఇచ్చారు. భారంగా అనిపించే పని చేయాలని అనుకోను అని అని అందుకే తప్పకున్నానని చెప్పారు.