Home » 24th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

24th feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad
INDIA CORONA UPDATE

INDIA CORONA UPDATE

ఇండియాలో గడిచిన 24గంట‌ల్లో 14,148 కరోనా కేసులు న‌మోద‌య్యాయి. 302 మరణాలు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇక‌ ప్రస్తుతం దేశంలో 1,48,359 కోరోనా కరోనా కేసులున్నాయి.

ఉక్రెయిన్‌పై రష్యా మిల‌ట‌రీ ఆప‌రేష‌న్ ను ప్ర‌క‌టించింది. డోన్‌బోస్ నుంచి ఉక్రెయిన్ బలగాలు వెనక్కి వెళ్లిపోవాలని వార్నింగ్ ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్ వార్నింగ్ ఇచ్చారు. ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని పుతిన్ వ్యాఖ్యలు చేవారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉక్రెయిన్ ప్రభుత్వం ఎమ‌ర్జెన్సీని కూడా ప్ర‌క‌టించింది.

Advertisement

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నేడు భారత్-శ్రీలంక మధ్య తొలి టీ20 మ్యాచ్ జ‌ర‌గ‌నుంది. లక్నో వేదికగా రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.

Bheemla nayak

ఏపీలో భీమ్లానాయక్ సినిమాకు జీవో నంబర్ 35 ప్రకారం పాత టిక్కెట్ ధరలే అమలు చేయాలని థియేటర్లకు రెవెన్యూ అధికారుల ఆదేశాలు జారీచేశారు. అదనపు షోలు ప్రదర్శిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరిక‌లు చేశారు.

Advertisement

కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కు సీఎం జగన్ లేఖ రాశారు. ఉక్రెయిన్ లోని పలు కాలేజీల్లో ఏపీకి చెందిన విద్యార్థులు చిక్కుకుని పోయిన విషయాన్ని సీఎం లేఖ‌లో వివ‌రించారు. రాష్ట్రానికి చెందిన విద్యార్థులను వెనక్కి రప్పించేందుకు రాష్ట్రం కేంద్రానికి అన్ని విధాలుగా సహకరిస్తుందని లేఖలో పేర్కొన్నారు.

హైద‌రాబాద్ లో స‌మావేశమైన బీజేపీ అసంతృప్త నేత‌ల‌పై అధిష్టానం సీరియ‌స్ అయ్యింది. వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోర్ క‌మిటీ నిర్ణ‌యించింది. షోకాజ్ నోటీసులు కూడా పంపే ఆలోచ‌న‌లో అధిష్టానం ఉన్న‌ట్టు స‌మాచారం.

ష‌ర్మిల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీకి ఎన్నిక‌ల సంఘం గుర్తింపు ల‌భించింది. ప్ర‌స్తుతానికి అయితే ఆ పార్టీకి రాజ‌గోపాల్ అధ్య‌క్షులుగా ఉన్నారు. త్వ‌ర‌లోనే ఈసీకి షర్మిల పేరును పంప‌నున్నారు.

విజ‌య‌నగరంలో భారీ చోరీ జ‌రింగింది. గంట స్థంభం వెన‌క ఉన్న ర‌విజ్యూల‌రీస్ లో దుండ‌గులు 5కిలోల బంగారాన్ని ఎత్తుకెళ్లారు.

హైద‌రాబాద్ లోని మాదాపూర్ లో దారుణం చోటు చేసుకుంది. లాలూ ప్ర‌సాద్ అనే దుర్మార్గుడి వ‌ల్ల ఓ యువ‌తి బ‌ల‌య్యింది.

భారత టూర్ కు శ్రీలంక క్రికెట్ జ‌ట్టును ప్ర‌క‌టించారు. అయితే ఈ జ‌ట్టులో క్రికెట‌ర్ భానుక రాజ‌బ‌క్స కు చోటు క‌ల్పించ‌క‌పోవ‌డంతో అభిమానులు రోడ్డెక్కారు. జ‌ట్టులోకి తీసుకోవాల‌ని డిమాండ్ చేస్తున్నారు.

Visitors Are Also Reading