Home » 22st feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

22st feb 2022 Top 10 News : నేటి ముఖ్యమైన వార్తలు..!

by AJAY
Ad

పశ్చిమ ఆఫ్రికా దేశం బుర్కినా ఫాసోలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బంగారు గనిలో పేలుడు సంబ‌వించ‌డంతో 59 మంది మృతి చెందారు. 100 మందికి పైగా తీవ్రగాయాల‌య్యాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది.

అమెరికా జాతీయ భద్రతా బృందంతో ప్రెసిడెంట్ జోబైడెన్‌ భేటీ అయ్యారు. రష్యా-ఉక్రెయిన్‌ ఉద్రిక్తతలను అధికారులు బైడెన్ కు వివ‌రించారు.

Advertisement

హైదరాబాద్‌లో బంగారం ధరలు స్వ‌ల్పంగా త‌గ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.45,900 ల‌కు చేరుకోగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.50,050 గా ఉంది.

 


రేపు మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి. కాసేపట్లో బేగంపేట్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో నెల్లూరుకు భౌతికకాయాన్ని త‌ర‌లిస్తారు. నేడు నెల్లూరులో కార్యకర్తల సందర్శనార్థం గౌతమ్‌రెడ్డి ఇంట్లో భౌతికకాయాన్ని ఉంచ‌నున్నారు. రేపు మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వ‌హించ‌నున్నారు.

కర్నూలులో నేటి నుంచి శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జ‌ర‌గ‌నున్నాయి. మార్చి 4వ తేదీ వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వ‌హించనున్నారు.

Advertisement

ఈరోజు ఐక్య రాజ్య‌స‌మితి భద్రతా మండలి అత్యవసర సమావేశం కానుంది. ఉక్రెయిన్‌, రష్యా సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేప‌థ్యంలో ఐక్య‌రాజ్య‌స‌మితి అత్యవసరంగా భేటీ అవుతోంది.

విశాఖ ఉక్కుపై జిందాల్ స్టీల్ కన్ను పడింది. విశాఖ స్టీల్ కొనుగోలుకు జిందాల్ స్టీల్ మొగ్గు చూపిస్తోంది. జిందాల్ ఎండీ ఆర్వీ శ‌ర్మ విశాఖ స్టీల్ ను ద‌క్కించుకునేందుకు ఆస‌క్తి చూపిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఈ యేడాది వాన‌లు త‌క్కువ కురిసే అవ‌కాశముంద‌ని స్కైమెట్ అంచ‌నా వేసింది. గ‌త రెండు మూడేళ్లుగా దేశంలో వర్షాలు పుష్క‌లంగా కుర‌వ‌గా ఈ యేడాది మాత్రం అంతంత మాత్రంగానే కురుస్తాయ‌ని స్కైమెట్ చెబుతోంది.

కాంగ్రెస్ అధినేత సోనియా గాంధీ మోడీ మ‌రియు యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ ల‌పై విరుచుకుపడ్డారు. దేశంలో 12ల‌క్ష‌ల ఉద్యోగాలు ఖ‌ళీగా ఉన్నాయని అయినా యువ‌త‌ను ఇంట్లో కూర్చోపెడుతున్నారని అన్నారు. పెట్రోల్ గ్యాస్ ధ‌ర‌లు అన్ని ఆకాశంలోనే ఉన్నాయ‌ని సోనియా గాంధీ పేర్కొన్నారు.

sonusood

sonusood

న‌టుడు రియల్ హీరో సోనూసూద్ పై కేసు న‌మోదైంది. యూపీ ఎన్నిక‌ల్లో సోనూసూద్ సోద‌రి మాళ‌విక ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా పోలింగ్ రోజున సోనూసూద్ ప్ర‌చారం చేయ‌గా నిబంధ‌న‌ల‌ను ఉల్లంగించాడంటూ సోనూసూద్ పై కేసు న‌మోదు చేశారు.

 

Visitors Are Also Reading