భారత్ లో కరోనా కేసులు భారీగా తగ్గుముకం పట్టాయి. గడిచిన 24గంటల్లో 1761 కరోనా కేసులు నమోదయ్యాయి. 127 మంది కరోనాతో మరణించారు.
తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. కాగా లాస్ ఏంజిల్స్‌లో మంత్రి కేటీఆర్‌కు ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. తెలంగాణలో పెట్టుబడులే లక్ష్యంగా అమెరికాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు.
Advertisement
నేడు తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేతల కీలక సమావేశం జరగనుండి. ఈనెల 22న ఢిల్లీకి వెళ్లే యోచనలో కాంగ్రెస్ సీనియర్ నేతలు ఉన్నారు. దాంతో మీటింగ్‌కు ఎవరెవరు హాజరవుతారనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.
ఎప్రిల్ 1 నుండి తెలంగాణలో హరిత నిధి అమలుకానుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల జీతం నుండి నిర్ధిష్టమొత్తాన్ని నిధికోసం జమచేయనున్నారు. ప్రజాప్రతినిధుల నుండి వారాళాలు సేకరించనున్నారు.
ఏపీ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై బస్సుల్లో డిజిటల్ చెల్లింపులు కూడా స్వీకరించాలని నిర్నయం తీసుకుంది.
Advertisement
ఈనెల 23 నుండి తెలంగాణలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు జరగనున్నాయి. కాగా పరీక్షలకు 15 నిమిషాలు ఆలస్యం అయినా అనుమతించవచ్చని…ఆ తరవాత అనుమతించవద్దని బోర్డు ఆదేశించింది.
టీఎస్ ఆర్టీసీలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసే ఉద్యోగుల వివరాలను సేకరిస్తున్నారు. ముందుగా వచ్చేవారి సంఖ్యను బట్టి వీఆర్ఎస్ అమలు చేయాలా వద్దా అనేది నిర్ణయించనున్నారు.
తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలకు ఏప్రిల్ 1 నుండి భక్తులను అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు టికెట్లను విడుదల చేసింది.. ఎప్రిల్ నుండి జూన్ వరకూ టికెట్లను ఆన్లైన్ లో అందుబాటులో ఉంచింది.
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు సన్నాహాలు జరుగుతున్నాయి. టెట్ దస్త్రం సీఎం కార్యాలయానికి చేరింది. దాంతో అతి త్వరలో టెట్ నోటిషికేషన్ వచ్చే అవకాశాలు కనపిస్తున్నాయి.
తెలంగాణలోని గ్రామపంచాయితీల్లో మిషన్ భగీరథ నీటిపై పన్నులు వసూలు చేయవద్దని పంచాయితీ రాజ్ శాఖ ఆదేశించింది. నీటిని ఇంటింటికి ఉచితంగానే అందిస్తామని ప్రకటించింది.