పవన్ కళ్యాణ్‌కు అహంభావం ఎక్కువ.. అతడికి సినిమాల్లో విజయాల కంటే పరాజయాలే ఎక్కువ అని ఏపీ మంత్రి అవంతి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. బీజేపీతో పొత్తు వల్ల పవన్ సాధించిందేంటి? అంటూ ప్రశ్నించారు. టీడీపీతో పొత్తు నుంచి ఎందుకు బయటకు వచ్చారు? ఇప్పుడు మళ్లీ ఎందుకు కలుస్తానంటున్నారు? మంత్రి అవంతి శ్రీనివాస్ పవన్ ను ప్రశ్నించారు.
చిత్తూరు మదనపల్లి మార్కెట్‌లో టమోటా ధరలు భారీగా పడిపోయాయి. కిలో 2 రూపాయలకు పడిపోయింది. దాంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
ఈరోజుతో తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ముగియనున్నాయి. నేడు అసెంబ్లీ సమావేశాలకు సీఎం కేసీఆర్ హాజరుకానున్నారు. ఉభయ సభల్లో ఈరోజు ద్రవ్య వినిమయ బిల్లుపై సభ్యులు చర్చించనున్నారు.
గత కొద్ది రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలు తాజాగా స్వల్పంగా తగ్గాయి. బంగారం 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.310 తగ్గి రూ.48,410గా నమోదయ్యింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.340 తగ్గి రూ.52,810కి చేరింది.
Advertisement
చంద్రబాబుని మళ్లీ అధికారంలోకి తేవడమే పవన్ కల్యాణ్ లక్ష్యం అని మంత్రి పేర్నినాని ఆరోపించారు. పవన్ రాజకీయ ఊసరవెల్లి.. వైసీపీకి కమ్మవారిని ఎందుకు దూరం చేయాలని చూస్తున్నారు..? అంటూ అవంతి ప్రశ్నించారు.
అమరీందర్ సింగ్ ను మళ్లీ కాంగ్రెస్ లోకి తీసుకువచ్చి తప్పు చేశామని పార్టీ నేతలు సోనియాగాంధీకి ముందు అన్నారు. దానికి సోనియా గాంధీ కూడా అంగీకరించారు.
చైనాలో కరోనా మళ్లీ పంజా విసురుతోంది. కొత్తగా స్టెల్ ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో చైనాలో 1337 కేసులు నమోదయ్యాయి. స్టెల్త్ ఒమిక్రాన్ కేసుల కారణంగా పలు నగరాల్లో లాక్ డౌన్ కూడా విధించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈఓ ఎలాన్ మస్క్ సవాల్ విసిరారు. దమ్ముంటే సింగిల్ గా రా తేల్చుకుందాం అంటూ సోషల్ మీడియా ద్వారా పుతిన్ కు సవాల్ చేశారు.
నేడు హిజాబ్ వివాదం పై కర్నాటక హైకోర్టు తీర్పును వెల్లడించనుంది. దాంతో ఎలాంటి అవాంచనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కర్నాటక వ్యాప్తంగా ఆంక్షలు విధించారు.