మనం ఇప్పటి వరకు కోతలు అంటే విద్యుత్ కోతలు అనే పేరును మాత్రమే విన్నాం. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలకలం రేపుతున్న అంశం ఇది.. ఇలాంటి విద్యుత్ కోతల లాగే ఆ దేశ రాజధానిలో వాటర్ కోతలు కూడా అమలు చేస్తున్నారట.. అది ఎక్కడో తెలుసుకుందాం..! చిలీ దేశం లోని శాంటియాగో గత 13 సంవత్సరాలుగా కరువుతో అల్లాడిపోతోంది. నాలుగు వందల తొంభై ఏళ్ల చరిత్ర గల నగరం ఎన్నడూ లేని విధంగా సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోంది. చిలి అనేది దక్షిణ అమెరికా దేశం. దాని రాజధాని శాంటియాగో. అయితే ఏ దేశంలోనైనా రాజధానిలో మెరుగైన సౌకర్యాలు అందిస్తారు. కానీ 60 లక్షల జనాభా కలిగిన శాంటియాగోలో మాత్రం నీళ్ల కోసం ఎదురు చూడాల్సి వస్తోంది. ఈ నగరం మీద రెండు నదులు కూడా వెళుతుంటాయి. మాయిపో, మాపోచో అనే నదులు.
Advertisement
Advertisement
ఇందులో మాపోచో నది శాంటియాగో తూర్పు నుంచి పశ్చిమం వైపు వెళుతున్నది. ఈ నది ద్వారా 1,42000 కుటుంబాలకు నీరు అందిస్తూ ఉంటారు. కానీ దక్షిణ నగరంలో నివాసం ఉన్నటువంటి 15.45 లక్షల కుటుంబాలకు మాయిపో నది ద్వారా దాహాన్ని తీరుస్తారు. మరి నదులు దగ్గర పెట్టుకొని కరువు ఎందుకు వచ్చిందంటే అక్కడ 13 సంవత్సరాలుగా వర్షాలు చాలా తక్కువ కావడంతో నీటివనరులు తగ్గిపోయాయి. నదిలో కూడా నీరు క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో అక్కడ తీవ్రమైన కరువు ఏర్పడింది. నది నీటిని ప్రణాళిక ప్రకారం 3 అంచెలుగా విభజించారు. మొదటి అంచే గ్రీన్ అలర్ట్.
నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచన. గ్రౌండ్ వాటర్ ని ఎక్కువగా వాడుకోవాలని తెలియజేస్తారు. ఇకపోతే రెండోది ఎల్లో అలర్ట్. నీటి పంపిణీ కోసం ఇచ్చేటువంటి ప్రెజర్ ను తగ్గిస్తారు. ఇక సమస్య రెడ్ అలర్ట్ తోనే మొదలవుతుంది. ఈ అలర్ట్ రాగానే వాటర్ కోతలు మొదలవుతాయి. దాదాపు 24 గంటల సేపు నీటి సరఫరా నిలిచిపోతుంది. నగరంలో ఉన్న 17 లక్షల మందికి 24 గంటల పాటు నీటిని ఆపేస్తారు. ఈ విధంగా గడిచిన 20,30 సంవత్సరాల్లో దేశంలో నీటి లభ్యత అనేది 37 శాతం వరకూ పడిపోయినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. రాబోయే రోజుల్లో 2060 కల్లా 50 శాతం నీటి లభ్యత పడిపోయే ప్రమాదం ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి.