దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గుముకం పట్టాయి. గడిచిన 24గంటల్లో 3,614 కరోనా కేసులు నమోదయ్యాయి. 89మంది కరోనాతో మృతి చెందారు.
నేడు వైసీపీ ఆవిర్భావ దినోత్సవం జరుగుతోంది. నేటితో వైసీపీ 11 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దాంతో శనివారం నాడు ఏపీ వ్యాప్తంగా వైసీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి.
Advertisement
రష్యాతో యుద్దంపై ఉక్రెయన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాతో యుద్ధం కీలక దశకు చేరుకుందని అన్నారు. తాము విజయానికి చేరువలో ఉన్నామని ఆయన వ్యాఖ్యానించారు.
శ్రీలంకలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీ.. లీటర్ పెట్రోల్‌పై రూ.50 పెరిగింది. లీటర్ డీజిల్‌పై రూ.75 పెరిగింది. ధరల పెంపు అనంతరం లీటర్ పెట్రోల్ రూ.254, లీటర్ డీజిల్ రూ.214గా పెరిగింది.
Advertisement
నటుడు మోహన్ బాబును అరెస్ట్ చేయాలంటూ రాజోలులో నాయీబ్రాహ్మణుల సంఘం డిమాండ్ చేస్తోంది. నాగశ్రీను చేసిన ఆరోపణలపై విచారణ జరిపి మోహన్ బాబును అరెస్ట్ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు.
కోర్టు తీర్పు నేపథ్యంలో అమరావతి ఉద్యమానికి విరామం ప్రకటించారు. ఏపీకి ఏకైక రాజధాని అమరావతే అని కోర్టు తీర్పునిచ్చింది. దాంతో అమరావతి ఉద్యమానికి పులిస్టాప్ పెట్టాలా కొనసాగించాలో తెలియని అయోమయంలో జేఏసీ నేతలు ఉన్నారు.
హైదరాబాద్ లో ఐఎంసీ భవనానికి సీజేఐ రమణ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన సింగపూర్ లా హైదరాబాద్ కూడా ప్రపంచ ప్రఖ్యాతి చెందాలని వ్యాఖ్యానించారు.
ఉక్రెయిన్ రష్యా యుద్దం 17వ రోజుకు చేరుకుంది. ఉక్రెయిన్ లోన నగరాలపై రష్యా బాంబుల దాడి కురిపిస్తూనే ఉంటుంది. ఇక తాజాగా మెలిటోపోల్ మేయర్ ను రష్యా సైనికులు కిడ్నాప్ చేశారు.
తెలంగాణలో ఐదోరోజు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. బడ్జెట్ సెషన్ లో భాగంగా ఐదవరోజు బడ్జెట్ సమావేశాలను ప్రారంభించారు.