కరోనా మహమ్మారి మెల్లిమెల్లిగా తగ్గుముకం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 4,184 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాల్లో ఓట్ల కౌంటింగ్ ప్రారంభం అయ్యింది. ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా, ఉత్తరాఖండ్, మణిపూర్ లలో ఎన్నికలు జరిగాయి. దాంతో నేడు ఓటింగ్ పై దేశవ్యాప్తంగా చర్చజరుగుతోంది.
Advertisement
ఏపీలో ఎండలు మండుతున్నాయి. ఊష్ణోగ్రతలు గరిష్టంగా 39 డిగ్రీలకు చేరాయి. ఈ నెల 14, 15 తేదీలలో 42 డిగ్రీల స్థాయికి చేరుకోవచ్చని కేఎల్ యూనివర్సిటి అంచనా వేసింది.
అసెంబ్లిలో తెలంగాణ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కాగా నేటి నుండి ప్రభుత్వ శాఖల పద్దులపై చర్చ జరగనుంది. ఐటీ, పరిశ్రమలశాఖ, మున్సిపల్, సమాచారం శాఖలకు సంబంధించిన పద్దులపై చర్చ జరగనుంది.
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శాసనమండలి మాజీ చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి శాసనమండలి చైర్మన్ పదవి ఖారారైంది.
Advertisement
కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఏకే ఆంటోని రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీకి లేఖ రాశారు. ఇదిలా ఉంటే ఏకే ఆంటోని మూడు సార్లు కేరళ సీఎంగా మూడు సార్లు కేంద్రమంత్రిగా పనిచేశారు.
రోడ్డు ప్రమాదంలో డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఇళంగోవన్ కుమారడు రాకేష్ మృతి చెందాడు. రాకేష్ పుదుచ్చేరి నుండి చెన్నై వెళుతుండగా రోడ్డుప్రమాదం జరిగింది.
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ మధ్య హోరా హోరీగా పోటి కనిపిస్తోంది. ఎన్నికల్లో ఆప్ విజయ కేతనం ఎగరవేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచానాలు వేస్తుండటంతో ఆప్ కార్యకర్తలు జిలేబిలను సిద్దం చేస్తున్నారు.
తెలంగాణలో 80వేలకు పైగా ఉద్యోగాలకు నోటిషికేషన్ లు ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా నోటిఫికేషన్ లు ఎన్నికల స్టంట్స్ అంటూ బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఏడేళ్లుగా నిరుద్యోగ సమస్యులతో ఎందరో ఆత్మహత్యలు చేసుకున్నారని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.