Home » ఎన్టీఆర్ కు ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా.. ఆమెను ప్రేమించారా..?

ఎన్టీఆర్ కు ఆ హీరోయిన్ అంటే అంత ఇష్టమా.. ఆమెను ప్రేమించారా..?

by Sravanthi
Ad

నందమూరి అందగాడు ఎన్టీఆర్ సరసన 47 మంది హీరోయిన్లతో నటించారు. వీళ్లలో ఎక్కువ చిత్రాల్లో ఆయన పక్కన నటించిన హీరోయిన్ జమున. 31 చిత్రాల్లో వీరిద్దరూ జంటగా నటించారు. ఆ తర్వాతి స్థానం మహానటి సావిత్రిది. ఎన్టీఆర్ సరసన సావిత్రి 26 చిత్రాల్లో నటించారు. అలాగే అంజలీదేవి కూడా ఇరవై ఆరు చిత్రాల్లో నటించడం గమనార్హం. వీళ్లందరిలో ఎన్టీఆర్ ఫేవరెట్ హీరోయిన్ కృష్ణకుమారి. వీరి కాంబినేషన్ అప్పట్లో చాలా క్రేజ్ ఉండేది. ఎన్టీఆర్ కూడా ఆమెతో నటించడానికి చాలా ఆసక్తి చూపేవారు. ఈ కారణంగా ఆయనతో పాతిక సినిమాలు చేయగలిగారు.

Advertisement

Advertisement

ఎన్టీఆర్ తో మొదటి చిత్రం పిచ్చిపుల్లయ్య. 25వ చిత్రం వరకట్నం. ఎన్టీఆర్ తో ఆమె తొలి పరిచయం నవ్వితే నవరత్నాలు సినిమా ప్రివ్యూ రోజున జరిగింది. ఆ సినిమాలో ఆమె నటన బాగుంది అని స్వయంగా అభినందించారు ఎన్టీఆర్. 1953లో పిచ్చి పుల్లయ్య సినిమాలో కృష్ణకుమారికి అవకాశం కల్పించారు ఎన్టీఆర్. ఆయనతో కలిసి పని చేస్తున్నప్పుడు వృత్తి నిబద్ధత ఏమిటో ఆమెకు తెలిసింది.

ఆ తర్వాత నాలుగు సంవత్సరాల కానీ ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశం రాలేదు. ఈ విధంగా ఎన్టీఆర్ కృష్ణకుమారి జంటకు విపరీతమైన క్రేజ్ ప్రేక్షకుల్లో పెరిగింది. ఈ విధంగా వారి మధ్య చాలా సినిమాలు వచ్చాయి. దీంతో ఎన్టీఆర్ కృష్ణకుమారి మధ్య ఏదో ఏర్పడిందని, అది పెళ్లిదాకా దారితీసిందని, కృష్ణకుమారి ఎన్టీఆర్ రెండో పెళ్లి చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డారని అంటుంటారు.

Visitors Are Also Reading