ఈ త‌ప్పులు చేయ‌కుంటే కేజీఎఫ్-2 మ‌రింత‌ పెద్ద హిట్ అయ్యేదా..?

ఎన్నో అంచ‌నాల మ‌ధ్య కేజీఎఫ్ పార్ట్ 2 ఎప్రిల్ 14న‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. భారీ అంచనాల మ‌ధ్య‌ విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకుంది

యితే సినిమాలో కొన్ని తప్పులు చేయకుండా ఉండి ఉంటే మాత్రం ఈ సినిమాకు మరింత రెస్పాన్స్ వ‌చ్చేద‌ని ప్రేక్ష‌కులు అభిప్రాయపడుతున్నారు.

ముఖ్యంగా సినిమాలో ఫ‌స్ట్ హాఫ్ సాగదీత గా ఉందని… అది సినిమాకు మైనస్ అయ్యిందని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

అంతేకాదు సినిమా కేజీఎఫ్ చాప్ట‌ర్ 1 లో అనంత్ నాగ్ నటించిన పాత్ర ప్లేస్ లో ప్రకాష్ రాజ్ ను తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే మొదటి పార్ట్ లో అనంత్ నాగ్ నటనకు ప్రేక్షకులు అడిక్ట్ అయ్యారు.

ఇక‌ రెండో పార్ట్ లో కూడా ఆయన్నే కంటిన్యూ చేస్తే బాగుండేదని ప్రేక్ష‌కులు అభిప్రాయపడుతున్నారు.

Read More  Click Here  మరింత సమాచారం ఇక్కడ చదవండి