Home » తెల్ల జుట్టు సహజంగానే నల్లగా మారాలంటే ఈ పండు తింటే అద్భుతమైన ఫలితం పక్కా..!

తెల్ల జుట్టు సహజంగానే నల్లగా మారాలంటే ఈ పండు తింటే అద్భుతమైన ఫలితం పక్కా..!

by Anji

నేటి జీవన శైలి కారణంగా చాలామందికి చిన్నతరంలోనే జుట్టు తెల్లబడిపోతుంది. అందులో చిన్న పిల్లలు, కాలేజీ విద్యార్థులను మరి ఎక్కువగా ఈ సమస్య వెంటాడుతుంది. వెంట్రుకలు తెల్లగా మారడం వల్ల వారు నలుగురిలో కలవలేక ఇబ్బంది పడిపోతుంటారు. పెరుగుతున్న కాలుష్యం, ఒత్తిడి వంటి అనేక కారణాల వల్ల చాలామందికి జుట్టు మెరుస్తుంటుంది. అలాగే, నెరిసిన జుట్టును వదిలించుకోవడానికి ప్రజలు జుట్టుకు మార్కెట్ లో దొరికే రకరకాల హెయిర్ కలర్స్ ఉపయోగిస్తుంటారు. కానీ అది తాత్కాలికంగా మాత్రమే ఉపశమనం కలిగిస్తుంది. అయితే ఈ సమస్యకు దీర్ఘకాల ఉపశమనం కలిగించాలంటే ఉసిరి కాయను వినియోగించాలి. ఉసిరి కాయ జుట్టు సంబంధిత సమస్యలను ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.


జుట్టును నల్లగా మార్చడంలో ఉపయోగపడే లక్షణాలు ఉసిరికాయల్లో పుష్కలంగా ఉంటాయి. ఉసిరిలో మెలనిన్ పిగ్మెంట్ ను పెంచడంలో సహాయపడే పోషకాలు ఉంటాయి. ఈ మెలనిన్ మీ జుట్టును నల్లగా మార్చడంలో సహాయపడుతుంది. ఉసిరిలో జింక్, విటమిన్ సి కూడా అధికంగా ఉంటాయి. ఇది మీ జుట్టును సహజ పద్ధతిలో అందంగా, నల్లగా మారుస్తుంది. అంతేకాకుండా ఇది ఇతర జుట్టు సంబంధిత సమస్యలను కూడా దూరం చేస్తుంది. ఉసిరి చుండ్రును తొలగిస్తుంది. రక్తప్రసరణను ప్రేరేపిస్తుంది. జుట్టు సంబంధిత సమస్యల నివారణ కోసం ఉసిరిని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. మొదటిది ఉసిరి రసం త్రాగవచ్చు. లేదంటే ఉసిరితో స్వీట్స్ తయారు చేసి తినవచ్చు. అలాగే రెండవ మార్గం ఏంటంటే.. జుట్టుకు ఉసిరి రసాన్ని వినియోగించాలి.

ఇది మీ జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. కాబట్టి ఉసిరికాయను తీసుకోవడం వల్ల జుట్టుకు ఎన్నో రకాలుగా మేలు జరుగుతుందనే విషయం మీకు అవకతం అయ్యి ఉంటుంది. ఉసిరికాయ మీ జుట్టుకు ఇతర మేలు కూడా చేస్తుంది. ఉసిరి మీ జుట్టును బలంగా, మృదువుగా, సిల్కీగా మార్చడంలో సహాయపడుతుంది. చాలా మందికి జుట్టు రాలిపోయే సమస్య ఉంటుంది. ఉసిరి ఈ సమస్యను నివారిస్తుంది. ఉసిరి శిరోజాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తం ప్రసరణను ప్రేరేపిస్తుంది. కాబట్టి ఉసిరి జుట్టు సంబంధిత అన్ని సమస్యలను నయం చేయడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది.

 

Visitors Are Also Reading