Home » జబర్దస్త్; అనసూయ ప్లేస్ లో టాప్ యాంకర్.. ఇక అందాల విందేనా..?

జబర్దస్త్; అనసూయ ప్లేస్ లో టాప్ యాంకర్.. ఇక అందాల విందేనా..?

by Sravanthi Pandrala Pandrala
Ad

జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతోమంది కమెడియన్ సినిమాల్లో రాణిస్తూ మంచి పొజిషన్లో ఉన్నారు. వీరు ఆర్థికంగా నిలదొక్కుకుని మంచి పేరు సంపాదించారు. జబర్దస్త్ కొద్దిరోజుల వరకు బుల్లితెర టెలివిజన్లలో షోలలో టాప్ షోగా కొనసాగుతూ వచ్చింది. కానీ ఇటీవల కాలంలో మాత్రం జబర్దస్త్ నుంచి చాలా మంది టాప్ యాంకర్స్, కమెడియన్స్ బయటకు వెళ్లడం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇటీవల అందాల యాంకర్ అనసూయ కూడా అందులో నుంచి తప్పుకోవడంతో దీంట్లో కి మరో గ్లామరస్ యాంకర్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి అంచనాలు లేకుండా మొదలైన ఈ షో, అంతగా సక్సెస్ కాదు అని అందరూ అనుకున్నారు. ఆఫర్లు వచ్చినా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.

Advertisement

ఇందులో కొంత మంది కమెడియన్స్ మొదట ఈ షో చేయడానికి అంతగా ఆదరణ చూపలేదు. ప్రముఖ యాంకర్లు కూడా ఈ షో అంత సక్సెస్ అవుతుందని అంచనా వేయలేకపోయారు. శ్రీముఖి కూడా ఇందులో యాంకరింగ్ చేసే అవకాశం వచ్చినా ఆమె రిజెక్ట్ చేశారట. ఇలా చాలామంది యాంకర్స్ ని అడిగిన తర్వాత చివరకు అనసూయను అడగడంతో ఆమె ఓకే చెప్పారట. ఈ విధంగా జబర్దస్త్ లో అడుగుపెట్టిన అనసూయ కమెడియన్స్ కామెడీ తో పాటుగా తన హాట్ హాట్ అందాలతో ఎంతోమంది కుర్రకారును ఆకట్టుకుంది. మధ్య మధ్యలో జబర్దస్త్ కి అనసూయ కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేసినా కూడా తర్వాత కంటిన్యూ అవుతూ వచ్చింది. ఈ విధంగా జబర్దస్త్ మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్ షో లు విజయవంతమయ్యాయి. ఈ విధంగా సినిమాలో ఎన్ని ఆఫర్లు వచ్చినా కానీ జబర్దస్త్ వదలలేదు అనసూయ.

Advertisement

 

నాగబాబు, రోజా తో పాటు గా అనసూయ కూడా కొనసాగుతూ వచ్చారు. జబర్దస్త్ ద్వారా మంచి ఆదాయం కూడా తీసుకున్నారు. వారంలో ఒకరోజు వచ్చే లోపు లక్షలకు పైగా రెమ్యునరేషన్ తీసుకునేది అని తెలుస్తోంది. ఇటీవల అనసూయ ఊహించలేనటువంటి నిర్ణయం తీసుకున్నట్లు కనబడుతోంది. ఆమె జబర్దస్త్ ను వీడి వెళ్లిపోయినట్లు గతంలోనే చాలా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ఆమె మరి కొన్ని కారణాలతో ఈ కామెడీ షో కు దూరం అయ్యే చాన్స్ ఉంది. ఒకవేళ యాంకర్ అనసూయ పూర్తిగా వెళ్లిపోతే ఆమె స్థానాన్ని భర్తీ చేయడం అంటే చాలా కష్టం. కానీ ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం చూస్తే మంజూష రాంపల్లి మొదటి ఆప్షన్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆమె ఇటీవల కాలంలో తన గ్లామర్ తో ఎంతో అట్రాక్ట్ చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా మంచి క్రేజ్ ఉన్న అమ్మడు. ఒకవేళ మంజూష రాంపల్లి వస్తే ఆమెకి యాభై వేల లోపు పారితోషికం ఇవ్వవచ్చని టాక్ వినిపిస్తోంది.

also read;

పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి పవిత్ర లోకేష్.. ఎవరిమీదంటే..?

మహేష్ బాబు మూవీలో విలన్ గా నటించే అవకాశాన్ని కోల్పోయిన గోపిచంద్…ఆ బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఎదో తెలుసా ?

Visitors Are Also Reading