Home » వంటి చేసి ఫైన్ కఠిన సంజూ, చాహల్..!

వంటి చేసి ఫైన్ కఠిన సంజూ, చాహల్..!

by Azhar
Ad

ఐపీఎల్ 2022 లో అదరగొడుతున్న జట్లలో రాజస్థాన్ రాయల్స్ కూడా ఒక్కటి. ఎక్కువ అంచనాలు లేకుండా బరిలోకి వచ్చిన ఈ జట్టు.. అద్భుతమైన ప్రదర్శనలు చేస్తుంది. ఆ జట్టు కెప్టెన్ సంజూ శాంసన్ కూడా బ్యాట్ తో మంచిగా రాణిస్తున్నాడు. అలాగే ఆ జట్టు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా బంతుల్లో అదరగొడుతూ.. ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్ గా నిలిచాడు. అయితే తాజాగా సంజూతో తనకు ఉన్న ఓ ఫన్నీ మూమెంట్ కు చాహల్ వివరించాడు.

Advertisement

2016లో ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్ళినప్పుడు… సంజూ తో కలిసి నేను ఓ అపార్ట్‌మెంట్‌లో తిరుగుతున్నాను. అక్కడ సంజూ ఓ ఫ్రైయింగ్ పాన్ తీసుకున్నాడు. ఆ తర్వాత రూమ్ కి వచ్చి… ఆకలిగా వేస్తుంది అని ఆ తీసుకువచ్చిన పాన్‌ని ఎలక్ట్రిక్ స్టవ్ మీద ఉంచి ఎగ్ ఫ్రై చేస్తున్నాడు. ఆ తర్వాత కాసేపటికే మా గదిలో ఫైర్ అల్లారం మోగడం ప్రారంభమైంది. దాంతో ఏం జరుగుతుందో తెలియక… మేము చాలా కంగారు పడ్డం. అంతలోనే మా రూమ్ కి ఫైరింగ్ సిబ్బంది కూడా వచ్చారు

Advertisement

వారు లోపలి వచ్చి ఏం జరిగింది అని అడగగా, మాకు ఏం తెలియదు… ఫైర్ అల్లారం ఎందుకు మోగిందో అర్ధం కావడం లేదు అని చెప్పం. కానీ తర్వాత చూస్తే సంజూ… ఆ ఫ్రైయింగ్ పాన్ కింద ఉన్న ప్లాస్టిక్ కవర్‌ను తీయలేదు. దాంతో ఆ కవర్ అనేది అంటుకొని పొగ వచ్చింది. ఆ పొగ వల్ల ఫైర్ అల్లారం మోగింది. అది చూసి మేము బాగా నవ్వుకున్నాము. ఇక మా వాళ్ళ అందరూ ఇబ్బంది పడ్డారు అని వారు మాకు ఫైన్ వేసి వెళ్లిపోయారు అని చాహల్ తెలిపాడు. అయితే ఈ ఐపీఎల్ లో ఇప్పటివరకు రాజస్థాన్ జట్టు ఆడిన 13 మ్యాచ్ లలో 8 విజయాలతో 16 పాయింట్లు సాధించి… పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో కొనసాగుతూ… దాదాపుగా ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంది.

ఇవి కూడా చదవండి :

ఉమ్రాన్ పై అక్తర్ ఆసక్తికర వ్యాఖ్యలు..!

నేను మా సీఈవో పేరు అందుకే తీసాను : శ్రేయాస్

Visitors Are Also Reading