టీమిండియా రైట్ ఆర్మ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహాల్ ను ఆర్సిబి విడుదల చేసిన విషయం తెలిసిందే. 2022లో చాహల్ ఆర్సిబిని వీడిన తర్వాత రాజస్థాన్ రాయల్స్ అతన్ని రిటైన్ చేసుకుంది. ఆ ఏడాది ఐపీఎల్ సీజన్ లో చాహల్ 27 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్గా నిలిచాడు. 2023లోను ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నారు. తాజాగా జరిగిన ఐపీఎల్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ చాహల్ ను రూ. 6 కోట్లకు రిటైన్ చేసుకుంది.
ఇక ఈ వేలంలో ఆర్సిబి యాజమాన్యం తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. వేలంలో మిచెల్ స్టార్క్, పాట్ కమిన్స్ లాంటి బౌలర్లను దక్కించుకోవడంలో విఫలం అయింది. భారీ ధరకు వెస్టిండీస్ బౌలర్ అల్జరీ జోసెఫ్ ను దక్కించుకుని ఫ్యాన్స్ ను తీవ్రంగా నిరాశపరిచింది. దీంతో ఆ జట్లలోని బౌలింగ్ దళంపై సోషల్ మీడియాలో విమర్శలు వెళ్లువెత్తాయి. తాజాగా చాహల్ కూడా ఆర్సిబి బౌలింగ్ దళంపై ఫన్నీగా కామెంట్స్ చేశాడు.
Advertisement
దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి దారితీసింది. రాయల్ చాలెంజర్స్ జట్టు బౌలింగ్ దళం ఎలా ఉందని ఓ నెటిజన్ చాహల్ ను ప్రశ్నించగా…. మోయె మోయె అంటూ చాహల్ ఇచ్చిన సమాధానం ప్రస్తుతం వైరల్ గా మారింది. మోయె మోయె ఈ పదాన్ని ప్రస్తుతం మీమ్స్, ట్రోల్స్ లో విపరీతంగా వాడుతున్నారు. ఈ పదానికి ఒకానొక భాషలో పీడకల అని అర్థం వస్తుంది. అయితే కోహ్లీతో మంచి ఫ్రెండ్షిప్ మైంటైన్ చేసే చాహల్ ఆర్సిబిపై ఇలా ట్రోల్ చేయడంతో అసంతృప్తిగా ఉన్నారు. చాహల్ 145 ఐపీఎల్ మ్యాచ్లు ఆడి 187 వికెట్లు పడగొట్టాడు.
Advertisement
మరిన్ని క్రీడల వార్తల కోసం ఇక్కడ చూడండి ! తెలుగు న్యూస్ కోసం ఇక్కడ చూడండి.