Home » భారత జట్టు వైఫల్యాలకు కారణం అదే..!

భారత జట్టు వైఫల్యాలకు కారణం అదే..!

by Azhar
Ad

2011 లో ప్రపంచ కప్ గెలిచిన తర్వాత భారత జట్టు ఐసీసీ టోర్నీల్లో అంత బాగా రాణించలేకపోతుంది. ప్రతి ఐసీసీ ఈవెంట్స్ లో సెమీస్ లేదా ఫైనల్స్ వరకు వెళ్లిన తర్వాత అభిమానులను నిరాశపరుస్తుంది. ఇలా భారత జట్టు ఐసీసీ టోర్నీలలో రాణించలేక పోవడానికి మిడిలార్డర్ సమస్యే కారణమని టీం ఇండియా మాజీ స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ అన్నాడు.

Advertisement

తాజాగా యువి మాట్లాడుతూ.. మేము 2011 ప్రపంచ కప్ ఆడుతున్నపుడు జట్టులో మా అందరికి స్థిరమైన బ్యాటింగ్ పొజిషన్ ఉంది. కానీ ఇప్పుడు జట్టులో మిడిలార్డర్ సమస్య చాల ఉంది. జట్టు సెలక్షన్ లో కూడా లోపాలు ఉంటున్నాయి. 2019 ప్రపంచ కప్ జట్టులోకి ఏ అనుభవం లేని విజయ్ శంకర్ ను తీసుకున్నారు. కానీ అంబటి రాయుడిని తీసుకుంటే జట్టు మరోలా ఉండేది అన్నారు.

Advertisement

అలాగే వచ్చే కాలంలో క్రికెట్ ప్రపన్నచం లో మొత్తం టీ20, టీ10 ఫార్మాట్లదే రాజ్యం అని తెలిపారు. ఆటగాళ్లు కూడా ఈ పొట్టి ఫార్మాట్లనే ఇష్టపడుతారు. ఒక్క టీ20 మ్యాచ్ ఆడితే 50 లక్షలు వస్తుంటే… టెస్ట్ మ్యాచ్ 5 రోజులు ఆడి 5 లక్షలు ఎవరు తీసుకుంటారు. అందుకే టెస్టులు చచ్చిపోతాయి. వీటితో పాటుగా వన్డేల పని కూడా అయిపోతుంది. టీ20 చూసి వన్డే చూస్తే అది కూడా టెస్ట్ లాగానే అనిపిస్తుంది అని యువి పేర్కొన్నాడు.

ఇవి కూడా చదవండి :

సన్ రైజర్స్ కు వ్యతిరేకంగా ఆడటం పై వార్నర్ కీలక వ్యాఖ్యలు…!

వైడ్స్ కూడా డీఆర్ఎస్ పెట్టాలి…!

 

Visitors Are Also Reading