Home » శ్రీకాంత్ రెడ్డి – కరాటే కల్యాణి ఇష్యూ…ఫుల్ సపోర్ట్ అతడికే అంటున్న నెటిజన్లు….!

శ్రీకాంత్ రెడ్డి – కరాటే కల్యాణి ఇష్యూ…ఫుల్ సపోర్ట్ అతడికే అంటున్న నెటిజన్లు….!

by AJAY
Ad

టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి రీసెంట్ గా యూట్యూబర్ శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో కరాటే కళ్యాణి ఆమెతో పాటు మరి కొందరు వ్యక్తులు యూట్యూబ్ శ్రీకాంత్ రెడ్డి ఇంటికి వెళ్లి అతడిని కొట్టారు. ఈ క్రమంలో శ్రీకాంత్ రెడ్డి సైతం కరాటే కళ్యాణి, ఆమె అనుచరులు పై దాడికి దిగాడు. అనంతరం ఒకరిపై ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. శ్రీకాంత్ రెడ్డి మహిళలతో అసభ్యకరమైన ప్రాంక్ వీడియోలు చేస్తున్నాడని ఆరోపిస్తూ కరాటే కళ్యాణి అతనిపై దాడి చేయడం జరిగింది.

Advertisement

అయితే శ్రీకాంత్ రెడ్డి మాత్రం తన వీడియో లో తప్పు ఉంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని కానీ నేరుగా వచ్చి దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నాడు. కరాటే కళ్యాణి తాను సామాజిక కార్యకర్తను అని బిజెపి నేత అని ఇలాంటి వీడియోలు సమాజానికి మంచిది కాదని చెబుతోంది. దాంతో శ్రీకాంత్ రెడ్డి కరాటే కళ్యాణి గతంలో చేసిన సినిమాలలోని వీడియో క్లిప్స్ చూపిస్తూ మీరు చేసింది అంతకంటే దారుణంగా ఉంది అని ఆరోపిస్తున్నారు.

Advertisement

ఇలా పరస్పరం ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. దాంతో కరాటే కళ్యాణి శ్రీకాంత్ రెడ్డిల వార్త హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ ఇష్యూ లో శ్రీకాంత్ రెడ్డి కి పలువురు యూట్యూబర్ లు సపోర్ట్ చేస్తున్నారు. అంతే కాకుండా సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు ఎక్కువగా శ్రీకాంత్ రెడ్డికే మద్దతు ప్రకటిస్తున్నారు. ఇదిలా ఉంటే శ్రీకాంత్ రెడ్డి తో కలిసి ప్రాంక్ వీడియోలు చేసిన యువతులు సైతం మీడియా ముందుకు వస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి బతుకుతెరువు కోసం వీడియోలు చేస్తున్నాడని చెబుతున్నారు.

శ్రీకాంత్ రెడ్డి చేసిన వీడియోలలో జిమ్ పోరితో ప్రాంక్ అనే వీడియో చాలా వైరల్ అయింది. కాగా ఈ వీడియోలో నటించిన యువతి తాజాగా కరాటే కళ్యాణికి కొన్ని ప్రశ్నలు వేసింది. కరాటే కళ్యాణి సినిమాలు చూస్తూ తాను పెరిగానని ఆమెను ఇన్స్పిరేషన్ గా తీసుకొని ఇలాంటి వీడియోలు చేశానని చెబుతోంది. మేము చేసింది తప్పు అయితే మీరు చేసింది కరెక్ట్ ఎలా అవుతుంది అంటూ ప్రశ్నిస్తోంది. కరాటే కళ్యాణి చేసిన పని వల్ల తమ కుటుంబ సభ్యులు ఇంట్లోకి రానివ్వడం లేదని ఆరోపిస్తోంది. అంతేకాకుండా కరాటే కళ్యాణి తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తోంది.

Also read :

మహేష్ బాబు ఆస్తుల విలువ ఎన్ని మిలియన్ డాలర్లో తెలుసా…ఒక్క విల్లాకే…!

Visitors Are Also Reading