Home » చంద్రబాబు చుట్టాల అమ్మాయితోనే షర్మిల కొడుకు వివాహం ?

చంద్రబాబు చుట్టాల అమ్మాయితోనే షర్మిల కొడుకు వివాహం ?

by Bunty
Ad

దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి కూతురు వైఎస్ షర్మిల గురించి తెలియని వారుండరు. అయితే షర్మిల, అనిల్ దంపతుల కుమారుడైనటువంటి వైయస్ రాజారెడ్డి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్టు తనే స్వయంగా ప్రకటించాడు. రాజారెడ్డి పెళ్లికి సంబంధించిన ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. వైఎస్ షర్మిల కు కాబోయే కోడలి పేరు ప్రియా అట్లూరి. ఈమె కమ్మ సామాజిక వర్గానికి చెందినది. దింతో టీడీపీ, చంద్రబాబు బ్యాక్ గ్రౌండ్ ఆమెకు ఉందని అంటున్నారు.

Advertisement

ఆమెకి యూఎస్ సిటిజెన్ షిప్ ఉండడం వల్ల అక్కడే స్థిరపడింది. వైఎస్ రాజారెడ్డి మరియు ప్రియ అట్లూరి ప్రేమ వివాహం చేసుకుంటున్నారు. గత నాలుగేళ్లుగా వీరు ప్రేమించుకుంటున్నట్టు సమాచారం. ఉన్నత చదువులకై విదేశాలకు వెళ్లిన రాజారెడ్డికి అక్కడ ప్రియ అట్లూరితో పరిచయం అయ్యింది. వారు తక్కువకాలంలోనే స్నేహితులుగా మారి ప్రేమించుకున్నారు. వారి ప్రేమ వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు ఎటువంటి అభ్యంతరం తెలుప లేదు. వచ్చి ఏడాది వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు.

YS Sharmila Son Marriage

వైయస్ షర్మిల లాగానే తన పుత్రుడు కులాంతర వివాహం చేసుకుంటునాడు. ఇతడు డల్లాస్ లోనీ యూనివర్సిటీలో బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ కోర్సు పూర్తి చేశాడు. యూనివర్సిటీ నుంచి ఇప్పటికే పట్ట అందుకున్నాడు ఆ కార్యక్రమానికి వైయస్ షర్మిల హాజరైన విషయం తెలిసిందే. ఇద్దరూ ఉన్నత కుటుంబానికి చెందిన వారు కావడంతో జనం యొక్క ఫోకస్ వీరి మీద పడింది. తెలంగాణలో షర్మిల ఇటీవల జరిగిన ఎన్నికలకు పోటీ చేయకుండా కాంగ్రెస్కు మద్దతు తెలిపింది.

Advertisement

మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!

Visitors Are Also Reading