ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు మరో రెండు నెలల్లో జరగనున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంపై ఫోకస్ చేశాయి. ఇక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ పుంజుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగానే వైయస్ షర్మిల కు ఏపీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పగించాలని ఆలోచన చేస్తోందట కాంగ్రెస్ పార్టీ.
Advertisement
దీనికి షర్మిల కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే, షర్మిల ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అంశంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు రియాక్టు అయ్యారు. షర్మిల ఏపీ కాంగ్రెస్ లోకి వస్తె ఆహ్వానిస్తామని ప్రకటించారు. గతంలోనే షర్మిలను ఏపీ కాంగ్రెస్ లోకి రావాలని కోరాను… ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలి గా షర్మిల నియమిస్తున్నారు అనే విషయంపై నాకు ఇప్పటి వరకు సమాచారం లేదని వెల్లడించారు.
ఫైనల్ గా పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అందుకు కట్టుబడి ఉంటానని చెప్పారు. జాతీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ సంస్థాగత బలోపేతం కోసమే తీసుకుంటుంది… రేపు ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ కమిటీ నేతలతో అధిష్టానం సమావేశ ఉందన్నారు. ఇందులో రానున్న ఎన్నికలు, పార్టీ సంస్థాగత బలోపేతం వంటి పలు అంశాలపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చ ఉంటుందని చెప్పారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు.
Advertisement
మరిన్ని తెలుగు సినిమా వార్తల కోసం ఇవి చూడండి! తెలుగు న్యూస్ కోసం వీటిని చూడండి!