సాధారణంగా ఏదైనా వీడియో చూడాలంటే తప్పకుండా మనం యూట్యూబ్ ఓపెన్ చేస్తుంటాం. ఇక స్మార్ట్ ఫోన్ చేతిలో ఉన్న ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూడకుండా అసలు ఉండలేరు. ఎంతోమంది ఒత్తిడి పోగొట్టుకోవడానికి, టైమ్ పాస్ చేసేందుకు యూట్యూబ్ ని విపరీతంగా వాడుతుంటారు. అదేవిధంగా చిన్నపిల్లలు కూడా యూట్యూబ్ లో పలు గేమ్స్, కథలకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా చూస్తుంటారు. అలాగే చాలామంది ఈ యూట్యూబ్ ద్వారా పాపులర్ అయ్యారు. లక్షలకు లక్షలు సంపాదిస్తున్నారు.
Advertisement
అంతేకాదు చాలామంది ఉన్నత ఉద్యోగాలను సైతం విడిచిపెట్టి యూట్యూబర్లుగా కెరీర్ స్టార్ట్ చేస్తున్నారు. ఇలాంటి వాటిలో క్రియేటివ్ థింక్స్ అడ్వెంచర్ ఛానల్. దీనిని సురేష్ అలియాస్ శ్రీ నిర్వహిస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం ఇతను మౌనిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. స్వతహాగా యూట్యూబ్ కావడంతో శ్రీ తన పెళ్లి తంతును కూడా యూట్యూబ్ లో పెట్టేసాడు. ఎవరైనా అయితే మా జంటను దీవించండి అని కొరతారు. మనోడు కాస్త వెరైటీగా తన పెళ్లికి కట్న కానుకలు చదివించండి అని కోరారు.
Advertisement
ఇంకేముంది ప్రేక్షకులు కూడా అతనిపై అభిమానంతో సీరియస్ గా తీసుకొని ఏకంగా రూ. 4.47 కోట్లను కానుకలుగా సమర్పించారు. ఈ విషయాన్ని స్వయంగా శ్రీ నే వెల్లడించాడు. మొత్తం 23,301 మంది సబ్స్క్రైబర్లు తనకు కానుకలు సమర్పించారని చెప్పాడు. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది. కట్నాలు పంపాలనుకున్నవారు ఎంత చదివించాలి అనుకుంటున్నారో, ఏమి ఇవ్వాలనుకుంటున్నారో జస్ట్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తే చాలని చెప్పాడు. ఆ విధంగా రాసిన మొత్తం రూ.4,37, 87,213 కోట్లు. ఇకపోతే, తన అత్తమామల నుంచి శ్రీ రూపాయి కూడా కట్నం తీసుకోలేదు. ఐదు రోజుల క్రితం పోస్ట్ చేసిన శ్రీ-మౌనికల పెళ్లి వీడియోకు ఇప్పటివరకు 40 వేలకు పైగా కామెంట్స్ వచ్చాయి.
READ ALSO : అత్యంత ఖరీదైన కారును కొన్న హైదరాబాదీ..అసలు ఈ నసీర్ ఖాన్ ఎవరో తెలుసా ?