Home » బ్రహ్మంగారు చెప్పిందే జరిగిందిగా..సెలూన్‌లో యువతికి షేవింగ్..!

బ్రహ్మంగారు చెప్పిందే జరిగిందిగా..సెలూన్‌లో యువతికి షేవింగ్..!

by Bunty
Ad

బ్రహ్మంగారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆనాటి కాలంలోనే.. బ్రహ్మంగారు అనేక విషయాలను తన కాలజ్ఞానంలో వివరించారు. భవిష్యత్తు కాలంలో అనేక వింతలు చోటు చేసుకుంటాయని… నంది కడుపులో పంది పుడుతుందని… అలాగే మగాళ్లు ఆడవాళ్ళుగా మారతారని తన కాలజ్ఞానంలో వెల్లడించారు బ్రహ్మంగారు. అయితే ఆయన చెప్పిన మరో వింత తాజాగా చోటు చేసుకుంది. ఆడవాళ్లు కూడా షేవింగ్ చేసుకుంటారని… బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పారట.

Advertisement

ఇప్పుడు నిజంగా అది జరిగిపోయింది. ముఖం అందంగా కనిపించడం కోసం సెలూన్ లో మహిళ షేవింగ్ చేసుకుంటు కనిపించిన ఆ వింతను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.  ముఖంపై షేవింగ్ క్రీమ్ రాసి మగవాళ్ళ లాగా బ్లేడ్ తో షేవింగ్ చేసుకుంది ఓ అమ్మాయి. ఈ వింతను చూసిన నెటిజన్లు వీడియో కింద కామెంట్ల రూపంలో తమ భావాలను వ్యక్త పరుస్తున్నారు.

Advertisement

బ్రహ్మంగారు చెప్పినట్లే ఇప్పుడు ఇలా జరిందని అందరూ అంటున్నారు. అంతే కాదు అలా షేవింగ్ చేయడం వల్ల వెంట్రుకలు ఎక్కువ పెరిగే అవకాశం ఉంది అంటున్నారు నెటిజన్లు. కానీ ఆ మహిళ మాత్రం షేవింగ్ చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి, నూనెను తొలగిస్తుందని మేకప్ వేసుకోవడానికి మరింత సులువు అవుతుందని పేర్కొంది. ఇలా షేవింగ్ చేయడం వల్ల చర్మానికి ఎలాంటి హాని ఉండదని కూడా చెప్పుకొచ్చింది ఆ మహిళ.

ఇవి కూడా చదవండి : 

మహేష్ – నమ్రత ఇద్దరిలో ఎవరు ముందు ప్రపోజ్ చేశారో తెలుసా?

Ustaad Movie Review : `ఉస్తాద్‌` మూవీ రివ్యూ

Bholaa Shankar Review : భోళా శంకర్ రివ్యూ.. మెగాస్టార్‌ కు షాక్‌ తప్పదా ?

Visitors Are Also Reading