Telugu News » Blog » ఆస్కార్ అవార్డు దేనితో తయారు చేస్తారు ? ఆ షీల్డ్ ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఆస్కార్ అవార్డు దేనితో తయారు చేస్తారు ? ఆ షీల్డ్ ఖరీదు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by Anji
Ads

ప్రపంచ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే అవార్డు ఆస్కార్. సినీ నటీనటులు ఈ అవార్డును అందుకోవాలని కలలు కంటుంటారు. కానీ అందరికీ ఈ అవార్డు రావడం అంత ఆషామాషీ కాదు. చాలా మంది జీవితంలో ఒక్కసారి అయినా ఈ అవార్డు అందుకోవాలని భావిస్తుంటారు. అలాంటి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానోత్సవ వేడుకలకు లాస్ ఏంజిల్స్ లోని డాల్బీ థియేటర్ ముస్తాబ్ అయింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ నటీనటులు, దర్శక నిర్మాతలు అమెరికాలో సందడి చేస్తున్నారు. ఈసారి మన తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో RRR చిత్రం నుంచి నాటు నాటు సాంగ్ నామినేట్ అయింది. దీంతో యావత్ భారతీయులు ఆస్కార్ అవార్డు కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆస్కార్ అంటే ఏంటి..? ఈ అవార్డును దేనితో తయారు చేస్తారు. షీల్డ్ విలువ ఎంత అని చాలా మందిలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 95వ వసంతంలోకి అడుగుపెడుతున్న ఈ ఆస్కార్ అవార్డు గురించి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.  

Advertisement

Also Read :  నాగ శౌర్య ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ ట్రైలర్ రిలీజ్

Advertisement

ఆస్కార్ అవార్డుని పసిడి వర్ణంతో ఓ యోధుడు రెండు చేతులతో వీర ఖడ్గం చేతపట్టి ఫిల్మ్ రీలుపై ఠీవీగా నిలుచొని ఉన్నట్టు కనిపిస్తోంది. ఎంజీఎం స్టూడియో ఆర్ట్ దర్శకుడు కెడ్రిక్ గిబ్బన్స్ సృష్టించారు. ఆస్కార్ ప్రతిమ కింది భాగంలోని రీలు చుట్టూ 5 చువ్వలు ఉంటాయి. అకాడమీలో 5 విభాగాలకు అవి సూచికలు. ఎమిలో ఫెర్నాండెజ్ అనే నటుడిని నగ్నంగా నిలబెట్టి అతని ఆకారం నుంచి స్పూర్తి పొంది.. గిబ్బన్స్ ఈ ప్రతిమను రూపొందించాడట. అందుకే ఆస్కార్ ప్రతిమ న*గా ఆస్కార్ ప్రతిమ కింది భాగంలోకి రీలు చుట్టులో 5 చువ్వలుంటాయి. అకాడమీలోని 5 విభాగాలకు అవి సూచికలు. ఎమిలో ఫెర్నాండెజ్ అనే నటుడిని నగ్నంగా నిలబెట్టి అతని ఆకారం నుంచి స్పూర్తిపొంది గిబ్బన్స్ ప్రతిమను రూపొందించాడట. లాస్ ఏంజిల్స్ కి చెందిన ప్రసిద్ధ శిల్ప జార్జ్ స్టాన్లీ తయారు చేశారు. 

Also Read :  ముగ్గురు స్టార్ హీరోలతో సినిమాలు చేసిన ఆ దర్శకుడు ఎలా చనిపోయాడో తెలుసా ?

Manam News

గోల్డ్ షీల్డ్ గా కనిపించే ఈ ప్రతిమ వాస్తవానికి బంగారం కాదు.. కాంస్యంతో తయారు చేసి 24 క్యారెట్ల బంగారు పూత అద్దిన 13.5 అంగుళాల ఎత్తు 8.5 పౌండ్ల (450 గ్రాములుకి పైగా) బరువు ఉన్న ఆస్కార్ ప్రతిమ. దీని ఆధారంగా షికాగోలోని ఓవెన్స్ అండ్ కంపెనీ ఆధ్వర్యంలో ఏటా ఆస్కార్ ప్రతిమలను తయారు చేస్తారు. ఒక్కో ఆస్కార్  తయారీకి సుమారు 1000 డాలర్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా. 50 ఆస్కార్ ప్రతిమలను రూపొందించేందుకు దాదాపు నెల సమయం పడుతుందట. ఈ అవార్డు విలువ ఓ డాలర్ మాత్రమే అంట. ఆస్కార్ ప్రతిమ అమ్మితే కేవలం డాలర్ మాత్రమే వస్తుందట. అవార్డులు అమ్మకూడదు అనే నిబంధన  కూడా ఉంది. ఈ పురస్కారాలకు ఆస్కార్ పేరు రావడం వెనుక ప్రచారం ఉంది. మొదటిసారిగా పురస్కార ప్రతిమను చూసిన అకాడమీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గరెట్ హెర్రిక్. యోధుడు అచ్చం తన అంకుల్ ఆస్కార్ లా ఉన్నాడని అందట. ఆ తరువాత హాలీవుడ్ కాలమిస్ట్ సిడ్నీ స్కోల్ స్కీ తన వ్యాసంలో వీటిని ఆస్కార్ పురస్కారాలను ప్రస్తావించాడట. అలా ఆస్కార్ వాడుకలోకి వచ్చింది. తొలిసారిగా ఆస్కార్ అందుకుంటున్న నటుడు ఎమిల్ జన్నింగ్స్. దిలాస్ట్ కమాండ్ చిత్రానికి ఆయనకు ఉత్తమ నటుడిగా ఈ అవార్డు వచ్చింది. 

Advertisement

Also Read :  చిన్నపిల్లలు రాత్రిళ్లు నిద్రపోవడం లేదా..ఈ చిన్న చిట్కాలు పాటిస్తే ఇట్టే నిద్రపోతారు..!!