Telugu News » Blog » ఫైన్ కట్టమన్న ఇన్ స్పెక్టర్ ని ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

ఫైన్ కట్టమన్న ఇన్ స్పెక్టర్ ని ఏం చేశాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

by Anji
Ads

సాధారణంగా పోలీసులు ప్రజలను దాడి చేసే ఘటనలను మనం చాలా చూసి ఉంటాం. కానీ ఇక్కడ రవాణా శాఖ ఇన్ స్పెక్టర్ పై ఓ కొబ్బరిబోండాల వ్యాపారి కత్తితో దాడి చేసిన ఘటన కాకినాడలో చోటు చేసుకుంది. తనిఖీలలో భాగంగా రవాణా శాఖ ఇన్ స్పెక్టర్ కొబ్బరికాయల విక్రేతను లైసెన్స్ విషయం పై ప్రశ్నించారు.

Advertisement

Also Read :  వేసవిలో బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్ తప్పక తాగండి..!

ఈ నేపథ్యంలో సదరు అధికారిపై వ్యాపారి దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ ఘటనలో ఇన్ స్పెక్టర్ కి తీవ్రగాయాలయ్యాయి. కత్తిపోట్లకు గురైన బ్రేక్ ఇన్ స్పెక్టర్ వేలు కోల్పోయాడు. స్థానికుల సాయంతో అధికారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఇన్ స్పెక్టర్ పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్టు సమాచారం. వివరాల్లోకి వెళ్లితే.. కాకినాడలోని దేవాదాయ శాఖ ఆఫీస్ సమీపంలో వ్యాన్ పై పెంటా వెంకటదుర్గా ప్రసాద్ అనే వ్యక్తి కొబ్బరి బోండాలు అమ్ముతున్నాడు.

Advertisement

Also Read :  లంచ్ త‌ర‌వాత మ‌ధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి హానిక‌ర‌మా..? వైద్యులు ఏం చెబుతున్నారంటే..?

కొబ్బరి నీటితో ఈ ప్రయోజనాలు... ఇది తప్పకుండా మీకు ఉపయోగదాయకం. | Unknown And Useful Facts Of Coconut Water -

తనిఖీలలో భాగంగా అసిస్టెంట్ వెహికల్ ఇన్ స్పెక్టర్ ఎం.చిన్నారావు అతని దగ్గరికీ వెళ్లి వ్యాన్ రికార్డులు, ఫిట్ నెస్ సర్టిఫికేట్, ఇన్సూరెన్స్, పేపర్లను అడిగాడు. వ్యాన్ కి ఇదివరకు విధించినటువంటి జరిమానా చెల్లించాలని సూచించాడు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవ ప్రారంభమైంది. దుర్గా ప్రసాద్ ఆవేశంతో తన దగ్గర ఉన్న కొబ్బరిబోండాల కత్తితో ఇన్ స్పెక్టర్ ని గాయపరిచాడు. అక్కడ ఉన్న వారు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. వారిపై దాడి చేయబోయాడు. ఈ ఘటనలో ఇన్ స్పెక్టర్ చేతివేలు తెగింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దుర్గ ప్రసాద్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. 

Advertisement

Also Read :  రెండో పెళ్లి చేసుకున్న స‌మంత‌..? ఆ తాళి వెన‌క దాగున్న నిజం ఏంటంటే..?