Home » నాటు నాటు పాటలో హీరోలతో పోటీపడే వ్యక్తి గురించి మీకు తెలియని నిజాలు..?

నాటు నాటు పాటలో హీరోలతో పోటీపడే వ్యక్తి గురించి మీకు తెలియని నిజాలు..?

by Azhar
Ad
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి వంటి అద్భుత విజయం తర్వాత తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. దాంతో ఈ సినిమాపై చాలా అంచనాలే ఉండేవి. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలు కావడంతో ఆ అంచనాలు ఆకాశాన్ని తాకాయి. అందుకు తగ్గట్లుగానే ఈ మధ్య విడుదలైన ఈ సినిమా అభిమానులను బాగానే అలరించింది.
సినిమా విడుదల తర్వాత కొంత నెగెటివ్ టాక్ వచ్చిన అది ఎక్కువసేపు నిలవలేదు. దాంతో ఈ సినిమా 1000 కోట్లను దాటి ఇంకా పోతూనే ఉంది. ఇక ఏ ఈసినిమాలో వచ్చే నాటు నరు పాట విడుదలకు ముందే మంచి ఊపును క్రియేట్ చేసింది. ఇక సినిమాలో ఈ పాటకు ఎన్టీఆర్, రామ్ చరణ్ వేసే స్టెప్పులు ఇంకా హైలెట్ గా నిలిచాయి. అయితే ఈ పాటలో ఓ బ్రిటిష్ అధికారికి హీరోలతో పోటీ పాడుతారు. కేవలం ఈ ఒక్క పాటలో మాత్రమే కనిపించే ఆ నటుని గురించి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం..!
నాటు నాటు పాటలో హీరోలతో కలిసి పోటీ పడే నటుని పేరు ఎడ్వర్డ్ బుహక్. 1995 లో ఓ టీవీ షో ద్వారా ఇతను ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. అందుకే ఎక్కువగా టీవీ షోలలో నటించే ఎడ్వర్డ్.. సినిమాలో తక్కువగా కనిపిస్తూ… చాలా సేవా కార్యక్రమాలలో పాల్గొనేవాడు. అలాగే తన సోషల్ మీడియాలో ఎప్పుడు 10 మందికి ఉపయోగపడే పోస్ట్లు చేసే ఎడ్వర్డ్..ఈ మధ్యే తనకు ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆవకాశం ఇచ్చిన రాజమౌళికి ధన్యవాదాలు తెలిపాడు.
ఇవి కూడా చదవండి :

Advertisement

Visitors Are Also Reading