Home » పవన్ కళ్యాణ్ ఫెవరెట్ హీరో చిరంజీవి కాదు… మరెవరో తెలుసా..?

పవన్ కళ్యాణ్ ఫెవరెట్ హీరో చిరంజీవి కాదు… మరెవరో తెలుసా..?

by Azhar
Ad

రెండు తెలుగు రాష్ట్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారు ఎవరు ఉండరు. టాలీవుడ్ హీరోలందరిలో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అంటే అది పవన్ కళ్యాణ్ కే అని చెప్పాలి. అయితే మెగాస్టార్ చిరంజీవికి తమ్ముడిగా సినిమా ప్రపంచంలోకి అడుగు పెట్టిన పవన్… ఆ తర్వాత తనదియేనా స్టైల్ తో విపరీతమైన ఫ్యాన్ బేస్ ను సంపాదించుకున్నాడు. అయితే ఇంత మాది ఫ్యాన్స్ ను సంపాదించుకున్న పవన్ కళ్యాణ్ ఎవరి ఫ్యాన్ అని అడిగితే అందరూ… ఆయన అన్న చిరంజీవి అనుకుంటారు. కానీ అది తప్పు.

Advertisement

అవును… పవన్ కళ్యాణ్ ఫెవరెట్ హీరో వీచిరంజీవి కాదు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పాడు. తాజాగా పవర్ స్టార్ టాలీవుడ్ యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఈ సినిమాకు అర్జున్ దర్శకత్వం వహిస్తున్నారు. అయితే విశ్వక్ సేన్ 11వ సినిమాగా వస్తున్న ఇందులో అర్జున్ కూతురు ఐశ్వర్య హీరోయిన్ గా తన రంగప్రవేశం చేస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ను క్లాప్ కొట్టి ప్రారంభించారు పవన్.

Advertisement

ఇక ఈ కార్యక్రమంలో పవన్ మాట్లాడుతూ.. తాను ఎప్పటినుండో యాక్షన్ కింగ్ అర్జున్ కి పెద్ద అభిమానిని అని చెప్పారు. ఆయన సినిమాలు అన్ని తనకు బాగా నచ్చుతాయి అని పేర్కొన్నారు. ఇక ఇది పవన్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అందరూ ఆశ్చర్యపోయి ఉంటారు అనడంలో సందేహం లేదు. అయితే పవన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు అనేది అందరికి తెలిసిందే. ప్రస్తుతం క్రిష్ డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు అనే సినిమా షూటింగ్ లో చాల బిజీగా ఉన్నాడు. పవన్ కెరియర్ లో ఇది మొట్ట మొదటి పాన్ ఇండియా సినిమా కాబోతుంది. అయితే ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా పవర్ స్టార్ అభిమానులు మాత్రం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి :

కోహ్లీ ఫెయిల్ కు కారణం ఎవరో చెప్పిన పాకిస్థాన్ కెప్టెన్..

ఐపీఎల్ అంటే క్రికెట్ కాదు.. కేవలం డబ్బు మాత్రమే..!

Visitors Are Also Reading