Home » శోభన్ బాబు తన కొడుకును హీరో ఎందుకు చేయలేదో మీకు తెలుసా…?

శోభన్ బాబు తన కొడుకును హీరో ఎందుకు చేయలేదో మీకు తెలుసా…?

by Azhar
Ad
ప్రస్తుతం ఇండస్ట్రీలో వారసత్వం అనేది చాలా సాధారణమైన విషయం. మొదట ఎవరో ఒక్కరు ఎలాగోలా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చి ఆ ఆతర్వాత మొత్తం ఫ్యామిలీకి రంగ ప్రవేశం చేస్తారు. ముఖ్యంగా హీరోలు. ఎవరైనా సరే ఇండస్ట్రీలో టాప్ హీరోగ ఆనను అంటే చాలు.. తన తమ్ములు, కొడుకులను ఇలా అందర్నీ హీరోలుగా మార్చేస్తారు. ఇందులో ఇప్పుడు ఉన్న సంగం మందికి హీరోలకు పైగా సాక్ష్యం గా ఉన్నారు. కొంతమంది తమ కోసుకులం హీరోలు చేస్తే మరికొంత మంది తమ్ములను కూడా చేసారు.
ఇక టాలీవుడ్ మొదట్లో టాప్ హీరోలుగా ఉన్న వారిలో శోభన్ బాబు కూడా ఒక్కడు. తన అందంతో అభినయంతో సోగ్గాడిగా పేరు తెచ్చుకున్నా శోభన్ బాబు.. ఇప్పుడు మహేష్ బాబు ఎలా అందాల రాకుమారుడో.. అప్పుడు ఆయన కూడా అలానే ఉండేవారు. అయితే ఇంత స్టార్ డమ్ ఉన్న కూడా మిగితా హీరోల మాదిరి తన కొడుకున మాత్రం ఆయన సినిమాలకు పరిచయం చేయలేదు. ఎప్పుడు ఇండస్ట్రీకీ దూరమే ఉంచాడు. అయితే ఆయన అలా ఎందుకు చేసాడో ఇప్పుడు బయటకు వచ్చింది.
తాజాగా టాలీవుడ్ నటుడు రాజా రవీంద్ర పాల్గొన ఓ ఇంటర్వ్యూలో శోభన్ బాబు గురించి మాట్లాడాడు. నేను ఓసారి ఆయనతో.. సార్ మీ కొడుకును హీరో చేయరా అని ప్రశ్నించగా.. ఆయన సమాధానం ఇస్తూ.. హీరోగా నేను ఎంత టెన్షన్ పడుతున్నానో.. అంత టెన్షన్ పెడుతున్నాను కూడా. కాబట్టి ఈ టెన్షన్స్ అన్ని నా కొడుకుకు అవసరం లేదు అని నాకు అనిపించింది. అందుకే వాడిని ఇండస్ట్రీకీ దూరంగా ఉంచాను అని చెప్పాడు అంటూ రాజా రవీంద్ర పేర్కొన్నారు.

Advertisement

Visitors Are Also Reading