సిల్క్ స్మిత అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు అందరికి గుర్తుకు వచ్చేది ఆమె కళ్ళు. ఓ మాలలు గ్రామం నుండి వచ్చిన సిల్క్ స్మిత ఆ తర్వాత ఇండస్ట్రీలో ఓ టచ్ అప్ గర్ల్ గా మారింది. అక్కడ ఓ నిర్మాత ఆమెను చూసి సినిమాల్లోకి తీసుకున్నాడు. అంతే.. అక్కడి నుండి ఆమె జీవితం మొత్తం మారిపోయింది. ఎవరు ఊహించని విధంగా పైకి ఎదిగింది. హీరోలు, హీరోయిన్లు కూడా సంపాదించలేని క్రేజ్ ను సిల్క్ స్మిత మాత్రం కేవలం పాటలతోనే సంపాదించింది.
Advertisement
కేవలం మన తెలుగు సినిమాల్లోనే కాదు.. మొత్తం ఇండియా వ్యాప్తంగా అప్పట్లో స్మిత పేరు మ్రగుమోగిపోయింది. ఆమె నటనకు.. ఆమె కళ్ళతో ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ కు కుర్రకారు మొత్తం మత్తులో మునిగిపోయేవారు. ఆమె డేట్స్ కోసం అప్పట్లో ఎదురు చూడని నిర్మాత గాని.. దర్శకుడు గాని లేదు అనేది నిజం. ఇక సిల్క్ స్మిత ఫాలోయింగ్ అప్పట్లో ఎలా ఉండేది అనేదానికి ఈ సంఘటన ఒక్క ఉదాహరణ. అయితే అప్పట్లో ఓ షూటింగ్ లో పాల్గొన సిల్క్ స్మిత మధ్యలో బ్రేక్ రావడం వల్ల పక్కకు వచ్చి యాపిల్ తింటుంది.
Advertisement
కానీ అప్పుడే డైరెక్టర్ షాట్ రెడీ అని చెప్పగానే ఆ యాపిల్ ను అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది సిల్క్ స్మిత. ఇది గమనించిన ఓ మేకప్ మ్యాన్ సిల్క్ స్మిత తిని వదిలి వేసిన ఆ సగం యాపిల్ ను అక్కడే వేలం వేసాడు. దీని స్కోసం అక్కడ సెట్ లో ఉన్నవారు చాలా మంది ఎగబడ్డారు. చివరికి ఒక్కరు దానిని 26 వేలకు కొనుగోలు చేసాడు. అయితే ఇప్పుడు 26 వేలేనా అని అనుకోవచ్చు.. గాని అప్పుడు ఆ 26 వేలే లక్షలతో సమానం. కానీ ఇంత క్రేజ్ ఉన్న సిల్క్ స్మిత జీవితం మాత్రం సగంలోనే ముగిసిపోయింది.
ఇవి కూడా చదవండి :