వాట్సప్ యూజర్లకు శుభవార్త అనే చెప్పాలి. వాట్సాప్ మరొక ఇంట్రెస్టింగ్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఏదైనా వాట్సప్ గ్రూపు నుంచి ఎవరికి తెలియకుండా సైలెంట్‌గా ఎగ్జిట్ అయ్యే అవకాశం కల్పిస్తోంది. ఇది ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా..? అయితే ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే తెలుసుకోండి.
Advertisement
సాధారణంగా ఎవరైనా వాట్సాప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ అయితే గ్రూపులో ఉన్న వారందరికీ తెలుస్తుంది. దీని వల్ల కొంత మంది వాట్సప్ గ్రూప్ నుంచి ఎగ్జిట్ కావడానికి యూజర్లు ఆలోచించి ఎగ్జిట్ అవ్వడానికి వెనుకాడుతుంటారు. ఈ పరిస్థితిని గుర్తించిన వాట్సాప్ ఇక యూజర్లకు ఉపయోగపడేవిధంగా ఫీచర్ రూపొందిస్తోంది. మీరు వాట్సప్ గ్రూప్ నుండి ఎగ్జిట్ అయితే గ్రూపులో ఉన్న సభ్యులకు తెలిసే అవకాశమే ఉండదు. వారికి తెలియకుండానే సైలెంట్‌గా ఎగ్జిట్ అయిపోవచ్చు. ఇక్కడ ఓ చిన్న ట్విస్ట్ కూడా ఉంది. మీరు గ్రూపు నుండి ఎగ్జిట్ అయిన విషయం మీ గ్రూప్ అడ్మిన్ కు మాత్రం తప్పకుండా తెలుస్తుంది.
వాట్సప్‌లో గ్రూప్ ఫీచర్ వచ్చిన తరువాత స్నేహితులకు, కుటుంబ సభ్యులకు ఓ గ్రూప్, బంధువులకు ఓ గ్రూప్, ఉద్యోగులకు, క్లాస్‌మేట్స్‌కు ఇలా రకరకాల పేరిట గ్రూపులు వచ్చాయి. ఒక్కొక్కరూ యావరేజీగా 10 నుంచి 20 వరకు గ్రూప్స్‌లో ఉంటారు. అనుమతి తీసుకోకుండా కూడా కొంత మంది గ్రూపుల్లో యాడ్ చేస్తుండడంతో యూజర్లకు తలనొప్పిగా మారింది. ఈ సమస్యకు పరిష్కారంగా వాట్సప్ కొత్త ఫీచర్ తీసుకొస్తుంది. దీంతో తమకు నచ్చని, అవసరం లేని వారు గ్రూప్స్ నుంచి ఎగ్జిట్ అయితే ఆ గ్రూపులో ఉన్న సభ్యులందరికీ తెలిసే అవకాశముండదు. గ్రూప్ అడ్మిన్లకు మాత్రమే ఈ విషయం తెలుస్తుంది. దీని వల్ల యూజర్లకు చాలా ఊరట లభించినట్టే.
Advertisement
మరొక వైపు వాట్సప్ గ్రూపు విషయంలో మరొక మార్పు రాబోతుంది. యూజర్లు చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఫీచర్ ఇది. ప్రస్తుతం ఓ గ్రూప్‌లో 256 మంది సభ్యుల్ని మాత్రమే చేర్చుకునే అవకాశముంది. ఈ లిమిట్‌ను పెంచాలని వాట్సప్ యూజర్లు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. ఇకపై వాట్సప్ గ్రూపులో 512 మంది యూజర్లను యాడ్ చేయవచ్చు. వాట్సప్ గ్రూప్ లిమిట్‌ను రెట్టింపు చేసింది కంపెనీ. గ్రూపు అడ్మిన్స్ తమ గ్రూపులను సమర్థవంతంగా నిర్వహించేందుకు కమ్యూనిటీ ట్యాబ్ కూడా తీసుకొచ్చింది. ఈ ఫీచర్ త్వరలోనే యూజర్లందరికీ అందుబాటులోకి రానున్నది. వాట్సాప్ కమ్యూనిటీస్ ఫీచర్ 2022లోనే వస్తుందని పేరెంట్ కంపెనీ అయిన మెటా ప్రకటించిన విషయం విధితమే. ఇటీవలే వాట్సప్ రియాక్షన్స్ ఫీచర్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. యూజర్లు తమకు నచ్చిన మెసేజ్‌కు ఎమోజీ ద్వారా రియాక్షన్ ఇవ్వవచ్చు. మెసేజ్ పై హోల్డ్ చేస్తే ఆరు రకాల ఎమోజీస్ అందుబాటులో ఉంటాయి. వాటిలో మీకు నచ్చిన రియాక్షన్ ఎంచుకోవచ్చు.
Also Read :
Malware Apps: బీ అలర్ట్.. మీ స్మార్ట్‌ఫోన్ నుంచి ఈ మూడు యాప్స్ వెంటనే తొలగించండి
నేడే Vivo X80, Vivo X80 Pro స్మార్ట్‌ఫోన్‌ల విడుదల.. పూర్తి వివరాలు ఇవే..!