Home » నువ్వు-నేను రజినీనే.. మీసం ఒక్కటే తేడా.. జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు

నువ్వు-నేను రజినీనే.. మీసం ఒక్కటే తేడా.. జడేజా ఆసక్తికర వ్యాఖ్యలు

by Anji
Ad

రవిచంద్రన్ అశ్విన్ వంద టెస్టులు ఆడిన భారత క్రికెటర్. సుదీర్ఘ ఫార్మాట్లో 500+ వికెట్లు తీశాడు. తమిళనాడు క్రికెట్ సంఘం అతడిని సన్మానించింది. ఈ క్రమంలో తన బౌలింగ్ జోడీపై ప్రశంసలు కురిపిస్తూ భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర వ్యాఖ్యలు వీరిద్దరూ కలిసి దాదాపు 500+ వికెట్లు తీశారు. అనిల్ కుంబ్లే – హర్భజన్ సింగ్ రికార్డును అధిగమించారు. “హాయ్ అశ్విన్ అన్న. వందో టెస్టులు ఆడటం.. 500 వికెట్లు తీసినందుకు శుభాకాంక్షలు. ఎంతో ఆనందంగా ఉంది. భారత క్రికెట్కు చేసిన సేవలు అద్వితీయం. భవిష్యత్తులోనూ వికెట్లు తీస్తూనే ఉండాలి.

Advertisement

Advertisement

నీ  మాస్టర్ మైండ్ తో నాకూ సూచనలు ఇస్తూనే ఉండాలి. నేను కూడా మరికొన్ని వికెట్లు తీసి నీ స్థాయికి చేరతా. ఈ సందర్భంగా నాకు ఓ సినిమా గుర్తుకొస్తోంది. మన ఇద్దరి పేర్లు ఒకటే నేను రవి ఇంద్రన్.. నువ్వు రవి చంద్రన్. ఒకరేమో మీసమున్న ఇంద్రన్. మీసం లేని చంద్రన్” అని జడ్డూ వ్యాఖ్యానించాడు. 1981లో వచ్చిన రజనీకాంత్ సినిమా దిల్లు – ముల్లు క్యారెక్టర్లను జడేజా గుర్తు చేశాడు. టీ20 ప్రపంచ కప్లో విరాట్ కోహ్లి తప్పకుండా జట్టులో ఉండాలని రోహిత్ శర్మ గట్టిగా పట్టుబడుతున్నట్లు మాజీ క్రికెటర్ కీర్తి ఆజాద్ వెల్లడించాడు. “విరాట్ గురించి జైషాను రోహిత్ శర్మ పట్టుబట్టాడు. ఎలాగైనా సరే కోహ్లిని ఆడించాలని కెప్టెన్ భావిస్తున్నాడు. జట్టు సెలక్షన్కు ముందే విరాట్ ఆడటంపై అధికారికంగా ప్రకటన చేయించాలని హిట్మ్యాన్ భావిస్తున్నట్లు సమాచారం” అని కీర్తి ఆజాద్ పోస్టు పెట్టాడు.

Also Read :   ముంబై ఇండియన్స్ కి బిగ్ షాక్.. రూ.4 కోట్ల ఆటగాడు దూరం..!

Visitors Are Also Reading