ఖమ్మం జిల్లాకు చెందిన ఏపూరి హర్షవర్దన్ అనే యువ డాక్టర్ మార్చి 24న ఆస్ట్రేలియాలో క్యాన్సర్ మహమ్మారితో పోరాడుతూ కన్నుమూశారు. అయితే ఆయన చనిపోయినప్పటికీ ఆయన క్యాన్సర్ తో పోరాడిన తీరు ధైర్యంగా చావుకు ఎదురెల్లిన తీరు ఆశ్చర్యపరుస్తోంది. అంతే కాకుండా ఆయన స్టోరీ చాలామందిని కదిలిస్తోంది. ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం…ఖమ్మం జిల్లాకు చెందిన హర్షవర్థన్ ఆస్ట్రేలియాలో డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు. హర్షవర్దన్ ఎంతో ఆరోగ్యంగా ఉండేవారు.
Advertisement
అంతే కాకుండా ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండేవారు. కానీ ఓ రోజు ఆయన జిమ్ చేస్తున్న సమయంలో ఆయాసం దగ్గుతో బాధపడ్డారు. దాంతో ఆస్పత్రికి వెళ్లి టెస్ట్ చేయించుకోగా లంగ్ క్యాన్సర్ నాల్గవ స్టేజ్ లో ఉందని డాక్టర్ లు స్పష్టం చేశారు. అయితే ఆ విషయం తెలిసిన కొద్దిరోజుల ముందే హర్షవర్దన్ కు బంధువుల అమ్మాయితో వివాహం జరిగింది. దాంతో హర్షవర్దన్ ఎంతో ఆవేదన చెందారు. అమ్మాయి విదవగా చనిపోకూడదని ఆమెను ఒప్పించి విడాకులు తీసుకున్నారు.
Advertisement
అంతే కాకుండా ఆమెకు భరణం కూడా ఎక్కువ మొత్తంలో చెల్లించాడు. విడిపోయినప్పటికీ ఆమెకు స్నేహితుడిగా ఉంటూ యోగక్షేమాలు తెలుసుకునేవాడు. ఇండియాలో కంటే ఆస్ట్రేలియాలోనే మెరుగైన వైద్యసేవలు ఉంటాయని అక్కడే చికిత్స తీసుకుంటానని పేరెంట్స్ ను ఒప్పించాడు. తల్లిదండ్రులు తనను చూసి తట్టుకోలేరని వారికి అలా చెప్పి ఆస్ట్రేలియాలోనే ఉండిపోయాడు. మొదట డాక్టర్ లు కీమో థెరపీ ద్వారా హర్షవర్దన్ కు చికిత్స అందించారు. ఫలితం లేకపోవడంతో రెండు సార్లు కీమో థెరపీ ద్వారా చికిత్స అందించిన అనంతరం చనిపోతాడన్న నిజాన్ని హర్షవర్దన్ కు చెప్పారు. ఆ విషయం తెలిసిన తరవాత హర్షవర్దన్ పేరెంట్స్ కు ఫోన్ చేసి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అమ్మా స్వారీ చాలా తొందరగా వెళ్లిపోతున్నా…ఏం చేయలేకపోతున్నా అంటూ ఫోన్ లో ఏడ్చాడు. ఇక మార్చి 24 వ తేదీన తన స్నేహితులతో కలిసి చాలాసేపు తల్లిదండ్రులతో వీడియో కాల్ మాట్లాడాడు. అనంతరం అందరూ కలిసి టిఫిన్ చేసి వచ్చారు.
ALSO READ : సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ రైలు టికెట్ ధరలు..టైమింగ్స్ ఇవే
ఒక గంట తర్వాత మళ్లీ ఫోన్ చేస్తా అని తల్లిదండ్రులకు చెప్పాడు. తరవాత తనకు మళ్ళీ కాఫీ తాగాలనిపిస్తుంది వెళ్లొద్దాం పద అని స్నేహితులతో అంటే…ఇప్పుడే తాగాము కదా అని స్నేహితులు చెప్పడంతో ఒక్కడే స్వయంగా కారు నడుపుకుంటూ వెళ్లి కాఫీ తాగి వచ్చాడు. రూమ్ కు వచ్చిన తరవాత బెడ్ పై అలా పడుకున్నాడు. రెండు నిమిషాల తర్వాత 32 సంవత్సరాల హర్ష వర్ధన్ శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయాడు. అయితే అలాంటి పరిస్థితుల్లో కూడా అంతిమ దశలో తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లడానికి కావలసిన ఏర్పాట్లు హర్ష స్వయంగా చేసుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. స్నేహితుల డబ్బులు ఒక్కరూపాయి కూడా ఖర్చు అవ్వడకుండా తన బాడీ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకూ వెళ్లే విధంగా తన డబ్బులతో ఏర్పాట్లు చేసుకున్నాడు. ప్రస్తుతం హర్షవర్దన్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ALSO READ :ఓ వైపు సీఎం జగన్ మరోవైపు శ్రీరెడ్డి…వైరల్ అవుతున్న అభిమాని టాటూ ఫోటో..!