Telugu News » ఊ అంటావా.. ఊహు అంటావా రెడ్డి అంటూ.. సీఎం జ‌గ‌న్‌పై RRR సెటైర్లు

ఊ అంటావా.. ఊహు అంటావా రెడ్డి అంటూ.. సీఎం జ‌గ‌న్‌పై RRR సెటైర్లు

by Anji

ఊ అంటావా రెడ్డి.. ఊహూ అంటావా రెడ్డి. కోర్టు తీర్పుకు ఊ అంటావా జ‌గ‌న్‌రెడ్డి. రైతులు పోరాడుతున్న గుడారాల‌ను తొల‌గించి వారి ప‌నులు వారు చేసుకోవాలి. అమ‌రావ‌తిని అభివృద్ధిని చేయాలంటూ సెటైర్లు వేశారు వైసీపీ రెబ‌ల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు. ఊహూ అన‌డానికి ఏపీ ప్ర‌భుత్వానికి అవ‌కాశం లేదు. పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి మూడంటే మూడు అన్నారు. చాలా మంది బుడంకాయ‌లు మాట్లాడారు.

Ads

Also Read :  రష్యాకు ఊహించని షాకిచ్చిన ఉక్రెయిన్..!


ఏమి మాట్లాడినా.. ఎంత ఫ‌ర్పామెన్స్ చేసినా ఉప‌యోగం లేదు. అమ‌రావ‌తి దీపం వెలుగుతో మీ అహం దీపం ఆరిపోయింది. మీరు జ్యోతిని ఎంత ఊదినా అది ఆగిపోదు. అలాగే ఉంటుంది. ఇప్ప‌టికైనా మీరు మారండి. మీలే మార్పు రావాలి. లేకుంటే మీరు ఇబ్బంది ప‌డ‌తారు.

అమ‌రావ‌తిని అభివృద్ధి చేయ‌డం ఇక నుంచి ప్రారంభించండి. ఇన్ని రోజులు రైతులు చేసిన పోరాటాల‌ను ప‌ట్టించుకోలేదు. ముఖ్యంగా మూడు రాజ‌ధానులు అంటూ ఏవేవో మాట్లాడారు. ఇప్పుడు ఏమంటారంటూ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణం రాజు సూటిగా ప్ర‌శ్నించారు.

Also Read :  తిరుప‌తిలో అవి దొర‌కట్లేదంటూ న‌రేష్ ట్వీట్…నువ్వు నీ అతి అంటూ నెట్టింట ట్రోల్స్..!


You may also like