Telugu News » Blog » రోజాకు మ‌హేష్ బాబుతో న‌టించాల‌ని ఉందట..!

రోజాకు మ‌హేష్ బాబుతో న‌టించాల‌ని ఉందట..!

by Anji
Ads

ఒక‌ప్పుడు టాలీవుడ్‌లో అగ్ర‌హీరోల స‌ర‌స‌న న‌టించి త‌న‌దైన ముద్ర వేసుకున్నారు న‌టీ రోజా. ఇప్పుడు ఒక‌వైపు టీవీ షోలు, మ‌రొక‌వైపు ఎమ్మెల్యే ప‌ద‌వీ ఇలా ఇరువైపులా దూసుకెళ్లుతున్నారు. ముఖ్యంగా ఈటీవీలో ప్రాస‌రం అవుతున్న జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మంలో జ‌డ్జీగా వ్య‌వ‌హరించే రోజాకు పాపులారిటీ ఎంత ఉందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఓ వైపు ఎమ్మెల్యేగా.. మ‌రొక వైపు టీవీ కార్య‌క్ర‌మాల‌తో రోజా బిజిబిజీగా క‌నిపిస్తుంటారు. తీరిక లేకనే ఈ మ‌ధ్య సినిమాల్లో న‌టించ‌డం లేదు. గ‌తంలో 100కు పైగా సినిమాల్లో న‌టించి త‌న‌కు అంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రోజా.

Ads

ALSO READ :  భార్య‌ల‌కు విడాకులు…భ‌ర‌ణంగా కోట్లు! ఎవ‌రెంతిచ్చారంటే?

Ads

అయితే త‌న‌కు ప్ర‌స్తుతం ఉన్న హీరోల్లో మ‌హేష్‌బాబు అంటే ఎంతో ఇష్టం అని వెల్ల‌డించారు. ఈ విష‌యాన్ని జ‌బ‌ర్ద‌స్త్ లోని ఓ స్కిట్ ద్వారా ఆమె బ‌య‌ట‌పెట్టారు. జ‌బ‌ర్ద‌స్త్ హోట్ టూర్‌లో భాగంగా హైప‌ర్ ఆది టీమ్ న‌గ‌రిలోని ఎమ్మెల్యే రోజా నివాసానికి వెళ్లారు. అక్క‌డ హాల్లో వెంక‌టేశ్వ‌ర స్వామి ఫొటో ఉండ‌డంతో హైప‌ర్ ఆది. ఆయ‌న‌ను ఏమి కోరుకుంటున్నార‌మ్మ అని ఆది అడిగితే కృష్ణ‌గారి అబ్బాయి మ‌హేష్‌బాబుతో సినిమా చేయాల‌ని ఉందంటూ రోజా ఆ దేవుడిని వేడుకున్నారు. అయితే ఇదంతా స్కిట్‌లో భాగం అని తెలుస్తోంది. అనంత‌రం రోజా చికెన్‌లోకి వెళ్లి టీ పెట్టి హై ప‌ర్ ఆది టీమ్ స‌భ్యుల‌కు ఇచ్చారు.

గ‌తంలో కూడా దొర‌బాబు ఒక్క‌డు పేరుతో హైప‌ర్ ఆది స్కిట్ చేసాడు. ఈ స్కిట్‌లో క‌మెడియ‌న్ దొర‌బాబు మ‌హేష్‌బాబుగా.. శాంతి స్వ‌రూప్ భూమిక‌గా క‌నిపించారు. దాంతో స్కిట్ అయిపోయిన త‌రువాత రోజా వాళ్ల‌కు వార్నింగ్ ఇచ్చారు. నువ్వు మ‌హేష్ బాబువా.. ఫ్యాన్ ఇక్క‌డ.. చంపేస్తాను ఇంకొక సారి మ‌హేష్ బాబు అంటే రోజా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. దానికీ మ‌ళ్లీ వెంట‌నే హైప‌ర్ ఆది పంచ్ వేశాడు. కృష్ణారామా అని ఇంట్లో కూర్చోవాల్సిన వ‌య‌స్సులో మ‌న‌కెందుకు అమ్మా మ‌హేష్ బాబు సినిమాలు అంటూ సెటైర్ వేసాడు. దాంతో చంపేస్తానంటూ రోజా స‌ర‌దాగా వార్నింగ్ కూడా ఇచ్చారు.

Ad

ALSO READ :  కన్నీళ్లు తెప్పిస్తున్న అన్నమయ్య, రామదాసు చిత్రాల రచయిత కష్టాలు ..!