Home » ప్రియురాలితో యాదమ్మ రాజు ఎంగేజ్మెంట్… వైరల్ అవుతున్న ఫోటోలు…!

ప్రియురాలితో యాదమ్మ రాజు ఎంగేజ్మెంట్… వైరల్ అవుతున్న ఫోటోలు…!

by AJAY
Ad

పటాస్ కామెడీ షో ద్వారా ప్రేక్షకులకు పరిచయమైన కమెడియన్ యాదమ్మ రాజు. పటాస్ లో మొదట స్టూడెంట్ గా వచ్చి తన పంచ్ లతో నవ్వించిన యాదమ్మ రాజు అదే షోలో కమెడియన్ చేసే ఛాన్సును అందుకున్నాడు. ఆ తర్వాత తన స్కిట్స్ తో యాదమ్మ రాజు ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. యాదమ్మ రాజు స్కిట్ లకు చాలామంది అభిమానులు ఉన్నారు.

Advertisement

ప్రస్తుతం యాదమ్మ రాజు టీవీ షోలతో పాటు వెబ్ సిరీస్ లలో మరియు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే యాదమ్మ రాజు కొంతకాలంగా ఓ అమ్మాయితో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. యాదమ్మ రాజు ఓ టీవీ షో లో తన ప్రియురాలు స్టెల్లాను పరిచయం చేశాడు. ఆ తర్వాత చాలా కాలం పాటు వీరిద్దరూ సోషల్ మీడియాలో తమ ఫోటోలను షేర్ చేసేవారు.

Advertisement

ఇక ఎట్టకేలకు యాదమ్మ రాజు స్టెల్లా తమ కుటుంబాన్ని ఒప్పించారు. అంతేకాకుండా తాజాగా వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా రాజు వెల్లడించారు. “మా ప్రేమ ఎప్పటికీ ఇలానే కొనసాగుతుంది. మొత్తానికి ఎంగేజ్మెంట్ జరిగిపోయింది. అంటూ ఆ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చారు. ఇక వీళ్ళ ఎంగేజ్మెంట్ కు యాంకర్ సుజాతతో పాటు పలువురు బుల్లితెర సెలబ్రిటీలు హాజరయ్యారు.

Visitors Are Also Reading