Home » ఆస్కార్ బరిలో భారతీయ చిత్రం…ఆ స్టార్ హీరోయిన్ సినిమా వెనక్కి…!

ఆస్కార్ బరిలో భారతీయ చిత్రం…ఆ స్టార్ హీరోయిన్ సినిమా వెనక్కి…!

by AJAY
Ad

సినిమా రంగంలో ఉన్నవారికి ఆస్కార్ అనేది ఒక డ్రీమ్. సినిమా రంగంలో ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారం కావడంతో ఆస్కార్ కోసం మేకర్స్ ఎంతో ప్రయత్నిస్తుంటారు. జీవిత లక్ష్యమే ఆస్కార్ గా పెట్టుకుని సినిమాలు తీసే దర్శకులు కూడా ఉన్నారు. కానీ చాలా మందికి ఆస్కార్ కలగానే మిగిలిపోతుంది అయితే తాజాగా ఆస్కార్ బరిలో మరో భారతీయ చిత్రం నిలిచింది. పలు తమిళ సినిమాలు ఆస్కార్ పోటీల కోసం షార్ట్ లిస్ట్ అయ్యాయి. అందులో లేడీ సూపర్ స్టార్ నయనతార నిర్మించిన తమిళ సినిమా కూరంగల్ కూడా ఉంది. అయితే ఈ సినిమా టాప్ 15 సినిమాల్లో నిలవలేకపోయింది. అయితే ఓ డాక్యుమెంటరీ ఫిల్మ్ మాత్రం టాప్ 15 రేసులో నిలిచి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

Advertisement

Advertisement

ఈ డాక్యుమెంటరీని ఖబర్ లహరియా అనే ఓ పత్రికను నడిపిస్తున్న దళిత మహిళల స్టోరీ ఆధారంగా తెరకెక్కించారు. ఈ పత్రికను కొందరు దళిత మహిళలు పురుషాధిక్యత ను ఎదిరించి..సామాజిక వర్గ విభేదాలపై అక్షరాలు రాస్తూ ముందుకు వెళుతున్నారు. వారి కథల ఆధారంగానే ఈ డాక్యుమెంటరీని సుస్మిత ఘోష్, రింటూ తోమస్ రైటింగ్ విత్ ఫైర్ పేరుతో తెరకెక్కించారు. అయితే ముందుగా పెద్దగా గుర్తింపు రాని లహరియా పత్రికకు కూడా ఈ డాక్యుమెంటరీ తో గుర్తింపు లభించింది. ఇక ప్రస్తుతం ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఈ సినిమాకు ఆస్కార్ రావాలని సినీప్రియులు కోరుకుంటున్నారు.

Visitors Are Also Reading