షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ ను ప్రారంభించిన సుహాస్ ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. కలర్ ఫోటో సినిమాతో సుహాస్ అభిమానులను సంపాదించుకున్నాడు. ఈ సినిమా తర్వాత వరుస ఆఫర్ లను అందుకుంటున్నాడు. సుహాస్ తాజాగా నటించిన సినిమా రైటర్ పద్మభూషణ్. ఈ సినిమాలో సుహాస్ హీరోగా నటించగా టీనా శిల్పా రాజ్ హీరోయిన్ గా నటించింది. షణ్ముఖ్ ప్రశాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ మరియు ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. దాంతో భారీ అంచనాల నడుమ ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అంచనాల ను రీచ్ అయిందో లేదో ఇప్పుడు చూద్దాం.
Advertisement
కథ :
పద్మభూషణ్ (సుహాస్) లైబ్రరీలో లైబ్రేరియన్ గా పనిచేస్తుంటాడు. ఎప్పటికైనా గొప్ప రైటర్ అవ్వాలని సుహాస్ కల కంటాడు. అతడి తండ్రి కూడా చాలా ప్రోత్సహిస్తాడు. ఇక ఎంతో కష్టపడి “తొలి అడుగు” అనే ఒక పుస్తకాన్ని రా. ఆ పుస్తకాన్ని కుటుంబ సభ్యులకు తెలియకుండా సొంత ఖర్చుతో పబ్లిష్ చేయిస్తాడు. ఆ పుస్తకం సేల్ కాదు కదా…. ఫ్రీగా ఇచ్చినా ఎవరూ తీసుకోరు. కానీ రైటర్ పద్మభూషణ్ పేరుతో ఒక పుస్తకం మార్కెట్లోకి వస్తుంది.
Advertisement
ఆ పుస్తకంతో సుహాస్ పాపులారిటీ ఎక్కడికో వెళ్లి పోతుంది. కానీ ఆ పుస్తకాన్ని రాసింది ఎవరు అన్నది మాత్రం తెలియదు. అంతేకాకుండా సుహాస్ కి పాపులారిటీ పెరగడంతో అతని మేనమామ తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. ఇంతలోనే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది సుహాస్ కు మరదలితో పెళ్లి జరిగిందా లేదా…? అసలు రైటర్ పద్మభూషణం పుస్తకాన్ని ఎవరు రాశారు అన్నది ఈ సినిమా కథ.
కథనం :
ఈ సినిమా ట్రైలర్ చూసి అందరూ కామెడీ ఎంటర్ టైనర్ అనుకున్నారు. అయితే సినిమాలో ఫ్యామిలీ డ్రామా, కామెడీ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలు ఉంటాయి. నవ్వించడంతోపాటు పద్మభూషణ్ ఏడిపిస్తాడు కూడా. చాలా సింపుల్ కథ అయినా తీసిన విధానం కొత్తగా ఉంది. ఫస్ట్ ఆఫ్ మొత్తం సుహాస్ తల్లిదండ్రుల చుట్టూ తిరుగుతుంది. సెకండాఫ్ లో హీరో హీరోయిన్ ల మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. సినిమా ఇంటర్వెల్ లో వచ్చే ట్విస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా ఈ సినిమా స్థాయిని క్లైమాక్స్ మరింత పెంచుతుంది. ఈ సినిమాలో కామెడీ ఎమోషనల్ సన్నివేశాలతో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. కాబట్టి ఒక్క మాటలో చెప్పాలంటే రైటర్ పద్మభూషణ్ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.
Advertisement
Also read :Michael Movie Review In Telugu : మైఖేల్ సినిమా ఎలా ఉందంటే..?